Let's talk: editor@tmv.in
మైసూరు జిల్లాలో పులి దాడి కలకలం – మేకల కాపరి మృతి

మైసూరు జిల్లాలో పులి దాడి కలకలం – మేకల కాపరి మృతి

Panthagani Anusha
28 అక్టోబర్, 2025

మైసూరు జిల్లాలో పులి దాడులు మళ్లీ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. ఆదివారం మధ్యాహ్నం ముల్లూరు గ్రామ సమీపంలో జరిగిన తాజా ఘటనలో ఒక మేకల కాపరి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దాడి సరగూరు తాలూకా ముల్లూరు గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. అటవీ అధికారుల సమాచారం ప్రకారం, ముల్లూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ మూర్తి (58) అనే మేకల కాపరి తన పశువులను మేపుతుండగా, ఒక్కసారిగా పులి దాడి చేసి అతడిని చంపింది. ఈ పులి “మనుషులను లక్ష్యంగా చేసుకుంటున్న మాంసాహారి పులి”గా అధికారులు అనుమానిస్తున్నారు.

నెలలో రెండోసారి పులి దాడి

గత నెలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వగ్రామం జిల్లైన మైసూరులో ఇదే విధంగా బడగలపుర గ్రామంలో మరో వ్యక్తి పులి దాడిలో మృతి చెందాడు. దీంతో జిల్లాలో నెల వ్యవధిలో రెండు పులి దాడులు జరగడం స్థానికులను మరింత భయభ్రాంతులకు గురి చేసింది.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటవీ శాఖ తమ బాధ్యత నిర్వర్తించడంలో విఫలమైందని, పులిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం చూపిందని వారు ఆరోపించారు. అంతేకాక మా ప్రాంతంలో పెద్దగా అడవి లేకపోయినా, తరచుగా పులులు తిరుగుతున్నాయి” అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా అటవీ శాఖ ఇప్పటికే పులిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఫలితం రాలేదు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అదేవిధంగా, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పులిని పట్టుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం అందించాలని ఆదేశించారు.

మైసూరు జిల్లాలో పులి దాడి కలకలం – మేకల కాపరి మృతి - Tholi Paluku