Let's talk: editor@tmv.in
మెరిడియన్ స్కూల్స్ తో ఎచ్ఓఏజి భాగస్వామ్యం: 'లీడర్‌షిప్ ల్యాబ్' ప్రారంభం

మెరిడియన్ స్కూల్స్ తో ఎచ్ఓఏజి భాగస్వామ్యం: 'లీడర్‌షిప్ ల్యాబ్' ప్రారంభం

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

మెరిడియన్ స్కూల్స్ హైదరాబాద్, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో ఎచ్ఓఏజి సంస్థతో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 'ఎచ్ఓఏజి లీడర్‌షిప్ ల్యాబ్'ను తమ క్యాంపస్‌లలో ప్రారంభించింది.

దీనిలో భాగంగా, ఈ విద్యా సంవత్సరం పొడవునా ఐదు విభిన్న అధ్యాయాల ద్వారా, రెండేసి రోజుల పాటు సాగే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మెరిడియన్ గ్రూప్‌నకు చెందిన బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్ క్యాంపస్‌ల నుండి సుమారు 1,200 మంది విద్యార్థులు ఈ వినూత్న అభ్యాస ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు.

ఈ లీడర్‌షిప్ ల్యాబ్ ముఖ్యంగా 11 నుండి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థుల కోసం రూపొందించబడింది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, మెంటర్ల పర్యవేక్షణలో వాస్తవ ప్రపంచ సవాళ్లు, సిమ్యులేషన్లు, ప్రయోగాత్మక అభ్యాసాల ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, వ్యూహాత్మక ఆలోచన, నైతిక నిర్ణయాధికారం, స్థితిస్థాపకత వంటి భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

ఈ సందర్భంగా మెరిడియన్ స్కూల్స్ సీఈఓ తేజస్వి బుట్టా మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అందిస్తూ, బాధ్యతాయుతమైన యువ నాయకులను తీర్చిదిద్దాలనే తమ లక్ష్యానికి ఈ లీడర్‌షిప్ ల్యాబ్ ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎచ్ఓఏజి వ్యవస్థాపకుడు ఆదిత్య విఎన్ చోప్రా కూడా స్పందిస్తూ, నాయకత్వ లక్షణాలు చిన్న వయస్సు నుంచే అలవడాలని, విద్యార్థులను విమర్శనాత్మక ఆలోచనాపరులుగా తీర్చిదిద్దడంలో ఈ భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

1995లో స్థాపించబడిన మెరిడియన్ స్కూల్స్, అకడమిక్ నైపుణ్యంతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి చేస్తోంది. మెరిడియన్ స్కూల్స్ అనేది సిబిఎస్సీ, ఐబి, కేంబ్రిడ్జ్ అనుబంధం కలిగిన ఒక ప్రగతిశీల కె-12 విద్యా సంస్థ. విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా మార్చడమే దీని లక్ష్యం.

మరోవైపు, ఎచ్ఓఏజి సంస్థ సంప్రదాయ విద్యా విధానంలోని లోపాలను భర్తీ చేస్తూ, విద్యార్థులకు ఆత్మ అవగాహన మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తోంది. ఈ రెండు సంస్థల కలయిక విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయనుంది.

మెరిడియన్ స్కూల్స్ తో ఎచ్ఓఏజి భాగస్వామ్యం: 'లీడర్‌షిప్ ల్యాబ్' ప్రారంభం - Tholi Paluku