Let's talk: editor@tmv.in
మెప్మాకు నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు

మెప్మాకు నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు

FL - SUNL
5 అక్టోబర్, 2025

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషిచేస్తున్న మెప్మా సంస్థ, తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాలలో ఒకేసారి ఏకంగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులను సాధించి చరిత్ర సృష్టించింది. బెస్ట్ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అవార్డు: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహించిన ఈ పోటీలో 19 ప్రభుత్వ శాఖలు పాల్గొనగా, ఈ అవార్డును మెప్మా దక్కించుకోవడం విశేషం. కంటెంట్ నాణ్యత, సృజనాత్మక ప్రచారాలు, రెగ్యులర్ పోస్టింగ్‌లు, ఎంగేజ్‌మెంట్ (లైక్స్, షేర్స్) స్వచ్ఛాంధ్ర థీమ్‌లను సమర్థంగా ప్రచారం చేసినందుకు ఈ గుర్తింపు లభించింది. మూడు స్టేట్ స్వచ్ఛ ఎస్.ఎల్.ఎఫ్ లెవెల్ అవార్డులు: టెర్రస్ గార్డెన్, హోమ్ కంపోస్ట్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మెప్మాకు చెందిన ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల SLFలు అవార్డులను గెలుచుకున్నాయి.

అవార్డుల ప్రదానం:

ఈ ప్రతిష్టాత్మక అవార్డులను సోమవారం (ఈ నెల 6వ తేదీన) విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఈ సోషల్ మీడియా అవార్డును అందుకోనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ మార్గదర్శకత్వం, అలాగే ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ పర్యవేక్షణకు దక్కిన గౌరవం ఈ పురస్కారాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని మెప్మా బృందం, పట్టణ స్వయం సహాయక సంఘాలకు అంకితమిచ్చారు.

మెప్మాకు నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు - Tholi Paluku