
మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం కావడం లేదు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ కు పి పి పి కి తేడా తెలియదని, మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం కావడం లేదని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని డిమాండ్ చేశారు. పి పి పి వల్ల నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 33 సంవత్సరాల తర్వాత యధావిధిగా కాలేజీలు అన్ని ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు.
రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన సాగుతుందని, రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పాలన సాగుతుందన్నారు.
మరో 15 సంవత్సరాలు కూటమి పాలన సాగితే అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు.
మెడికల్ కాలేజ్ ల సీట్లు తగ్గించలేదని, జీవో యధావిధిగా ఉందని మార్చలేదని చెప్పారు. జగన్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకే బయటికి వచ్చారన్నారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తున్నారు అన్నారు. జగన్ ఐదేళ్లపాటు నిద్రపోయి ఇప్పుడు మేల్కొన్నారు అన్నారు. ఈ ఐదేళ్లలో జగన్ కాలేజీలకి నిధులు ఎందుకు కేటాయించలేదు అన్నారు. జగన్ ఆత్మ పరిశీలన చేసుకోలని ,ఆయనలో మార్పు రావాలన్నారు. గత ఐదేళ్లలో వ్యాపారం చేస్తున్నారే తప్ప అభివృద్ధి గురించి, ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు.
జగన్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి ప్రైవేటు పరం కాకుండా కాపాడారన్నారు. కేంద్ర నుంచి రూ. 11,400 కోట్లు నిధులు విడుదల చేశారని ,స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం అన్నారు. జగన్ రాజకీయ లబ్ధి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయనలో మార్పు రాకపోతే ఎప్పుడైనా 11 సీట్లు కూడా రావు అన్నారు. అయితే అయితే ఇలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని గుర్తు చేశారు. లెక్కలు గ్రానైట్ మాఫియా రాష్ట్రాన్ని దోపిడీ చేశారని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు. కార్యక్రమంలో జనసేన ఫ్లోర్ లీడర్ , వసంత లక్ష్మీ, కార్పొరేటర్ కందుల నాగరాజు, మాసిపోగు రాజు , అక్కిరెడ్డి జగదీష్ , జనసేన పార్టీ సౌత్ ఇంచార్జీ శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు..
