Let's talk: editor@tmv.in
మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండా

మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండా

FL - SUNL
7 అక్టోబర్, 2025

వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల అంశంపై వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. చెవులు ఉన్నా వినలేని, కళ్లున్నా కనబడని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లు పునాదులకే పరిమితమైన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోంది. వైసీపీ నేతలు 17 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటున్నారు. కానీ ఎక్కడ నడుస్తున్నాయో ప్రజలకు చూపించలేకపోతున్నారు.

అందులో ఎన్ని కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు వచ్చాయి? పాడేరు కాలేజీ నిర్మాణం ఎంతమేరకు పూర్తయింది? ఎంత ఖర్చు పెట్టారు? ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా పేపర్ ప్రచారంతో కాలం గడిపారు.. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు.. ఇది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం , ప్రైవేట్ రంగం కలసి అభివృద్ధికి పనిచేసే విధానం. కానీ వైసీపీ నేతలు ప్రజల్లో భయం రేపేలా అబద్ధాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎఫిషియెన్సీ పెంచి, వనరులు పెంచి మెరుగైన వైద్య విద్య అందించాలన్న కూటమి సంకల్పాన్ని అడ్డుకోవడమే వైసీపీ ఉద్దేశం. ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు.. ఆస్పత్రులు మూతపడే పరిస్థితి వైసీపీ పాలనలో ఏర్పడింది.

ప్రైవేటీకరణ అంటూ అబద్ధాలు ఆడే ముందు, జీవోలు 107,108,133 ద్వారా కన్వీనర్ కోటాలోని 50 శాతం సీట్లను ప్రైవేటు చేతుల్లోకి వదిలింది మీరు కాదా? టీడీపీ హయాంలో నిమ్స్, ఎయిమ్స్, బర్డ్, అరవింద్, బసవతారకం వంటి ప్రసిద్ధ హాస్పిటల్స్ వచ్చిన మాట వాస్తవం కాదా?. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చంద్రబాబు గారు చేసిన కృషిని రాష్ట్రం మరచిపోలేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజకీయ లాభం పొందాలన్న దురుద్దేశంతో వైసీపీ పనిచేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం పీపీపీ మోడల్ ద్వారా 1750 కొత్త మెడికల్ సీట్లు త్వరలో సిద్ధం చేస్తోంది. ఇది ప్రజలకు నిజమైన సేవ, భవిష్యత్ తరాలకు బలమైన ఆరోగ్య పునాది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వైసీపీ మాటలు ఒకలా, పనులు మరోలా. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన వ్యక్తి జగన్‌. కరోనా సమయంలో సరైన వైద్యం అందించలేక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ పాలన అంటే అబద్ధాల రాజ్యం, అవినీతి పరిపాలన, ప్రజల ద్రోహం. వైద్యరంగానికి, విద్యారంగానికి కొత్త జీవం పోసే పాలన కూటమి ప్రభుత్వానిది.. ప్రజల జీవితాలను మెరుగుపరుచే దిశలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవి.

మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండా - Tholi Paluku