Let's talk: editor@tmv.in
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు

మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు

FL - YUGDR
30 సెప్టెంబర్, 2025

ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జె.వి.ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం డా.బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో డి.హెచ్.పి.ఎస్ జిల్లా కార్య వర్గ సమావేశం ఎస్. రాజులు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి డి.హెచ్ పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పి.పి.పి పద్దతిలో నడపాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేసారు.

వైద్య విద్య ను ఎస్సీ. ఎస్టీ , బడుగు , బలహీన వర్గాలకు దూరం చేయాలనే సంకల్పంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేసారు. అక్టోబర్ 31 న విశాఖ పట్నం లోని పౌర గ్రంధాలయం లో డి.హెచ్.పి.ఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వ హిస్తున్నాం అని అన్నారు. ఈ సమావేశం లో డి.హెచ్.పి.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల రాంబాబు , ఉపాధ్యక్షులు పెద పూడి దుర్గా రావు , నాయకులు జి.ఆనంద్ , కిరణ్ కుమార్ , కె.వన జాక్షి , దేముడమ్మ , పుష్ప లత పాల్గొన్నారు .

మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు - Tholi Paluku