
మెట్రో నెట్‌వర్క్‌లో అమెరికాను అధిగమించబోతున్న భారత్: కేంద్రమంత్రి మనోహర్ లాల్
దేశంలో మెట్రో నెట్‌వర్క్ విస్తరణ వేగం చూస్తుంటే, రాబోయే రెండేళ్ల నుంచి మూడేళ్లలో భారత్ అమెరికాను అధిగమించడం ఖాయమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ మంగళవారం తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ-పశ్చిమ రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,మెట్రో నెట్‌వర్క్ విస్తరణలో దేశం వేగంగా దూసుకుపోతోందని అన్నారు. 2004–05 నాటికి దేశంలో కేవలం ఐదు నగరాల్లోనే మెట్రో రైళ్లు నడుస్తుండగా, ప్రస్తుతం 24 నగరాలకు విస్తరించడమే భారత పట్టణ రవాణా రంగం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో చూపిస్తోందని ఆయన చెప్పారు.
అమెరికాలో మెట్రో నెట్‌వర్క్ 1,400 కిలోమీటర్లకు ఉంది. భారత్ ఇప్పటికే 1,100 కిలోమీటర్లకు చేరిందని. ఇంకా రెండు,మూడు సంవత్సరాల్లో అమెరికాను అధిగమించడం ఖాయం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా, అమెరికా చాలా ముందే మెట్రో వ్యవస్థలను అభివృద్ధి చేసినప్పటికీ, భారత్‌లో విస్తరణ వేగం అత్యంత వేగంగా ఉందని అన్నారు.పట్టణీకరణ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో, 2050 నాటికి పట్టణాలు దేశ జీడీపీలో 80 శాతం వాటా ఇవ్వనున్నాయని మంత్రి మనోహర్ లాల్ ప్రస్తావించారు. తెలంగాణలో మెట్రో విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ వంటి పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో అంతకుముందు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులు కేంద్ర అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాదు మెట్రో ఫేజ్–2, మూసీ నది పునరుద్ధరణ, గోదావరి నీటి మళ్లింపు, రీజినల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు ఇవ్వాలని, కేంద్ర సహాయం కొనసాగించాలని కోరారు.హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘గ్లోబల్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు.
మెట్రో రైలు రెండో దశ యొక్క నిర్దిష్ట మార్గాలు, విస్తరణ ప్రణాళికలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-IIలో నాగోల్ నుంచి శంషాబాద్ 36.8 కి.మీ ఎయిర్‌పోర్ట్ ను నగరానికి కలుపుతుంది.రాయదుర్గం నుంచి కోకాపేట్ వరకు 11.6కి.మీగా ఉంది. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13.4 కి.మీ పశ్చిమకు విస్తరించారు. ఎం.జీ.బిఎస్ నుంచి చంద్రయాన్ గుట్ట (ఓల్డ్ సిటీ) వరకు 7.5 కి.మీగా ఉంది. ఎల్.బి. నగర్ నుంచిహయాత్‌నగర్ వరకు 7.1 కి.మీగా నిర్ణయించారు.మొత్తం పెరుగుతున్న నెట్‌వర్క్ సుమారు 70 నుంచి 86 కిమీ వరకు వివిధ భాగాల సర్దుబాటు చేశారు.
ప్రాజెక్ట్ వ్యయం, రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-II కు సుమారు రూ.24,269 కోట్లు శాసనం చేసింది. డీపీఆర్ పనులు, డి-పార్ట్మెంట్ ఆమోదాలు, పొరచివేత/భూసేకరణ, అంతర్జాతీయ ఋణ-సమాహరణ సంబంధిత చర్చలు ప్రస్తుతం జరుగుతున్నయని. కొన్నిస్థలాల్లో పనులు మొదలుపెట్టడానికి గడచిన సంవత్సరం నుంచే ప్రిపరేటరీ వర్క్స్ జరుగుతున్నట్లు నివేదికలున్నాయి.
