Let's talk: editor@tmv.in
మున్సిపల్‌ ఎన్నికలు.. 14 వార్డుల్లో ఏకగ్రీవాల జోరు

మున్సిపల్‌ ఎన్నికలు.. 14 వార్డుల్లో ఏకగ్రీవాల జోరు

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

తెలంగాణ మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికైన 14 మున్సిపల్ వార్డుల్లో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండా విజయం సాధించినట్లు వెల్లడించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన విజయంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. స్థానిక స్థాయిలో ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నేతలు పేర్కొన్నారు. మిగిలిన 2 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన స్థానాలకు ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

వివరాలు ఇలా..

• జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ వార్డు–10 (ST జనరల్)లో పీ.విక్రమ్ (బీఆర్ఎస్)

• యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డు–17 (SC మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్)

• ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ వార్డు–15 (UR మహిళ)లో తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్)

• నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్)

• సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ వార్డు–3 (BC మహిళ)లో సులావ నాగలక్ష్మి (కాంగ్రెస్)

• సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–11 (UR మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్)

• సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–21 (BC మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్)

• సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–31 (UR మహిళ)లో యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్)

• మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–58 (UR మహిళ)లో బి.రమాదేవి (కాంగ్రెస్)

• మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు–32 (UR మహిళ)లో గోదల మానస (కాంగ్రెస్)

• పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–1 (UR మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్)

• వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–1 (UR జనరల్)లో అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్)

• వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–15 (SC జనరల్)లో పీ.విజయలక్ష్మి (బీఆర్ఎస్)

• యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్)