
ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ గడువు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్‌కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని మొత్తం 2,996 వార్డులకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగియడంతో, బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమవగా, చాలా చోట్ల ఉపసంహరణలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల తుది జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. వార్డుల వారీగా పోటిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించి, అధికారిక జాబితాను విడుదల చేయనుంది. అభ్యర్థుల ఖరారు కావడంతో ఇక అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచార హోరును పెంచేందుకు సిద్ధమవుతున్నారు.ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
