
ముగిసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్విట్జర్లాండ్, జర్మనీ పర్యటన
పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, సాంకేతికత ఆధారిత తయారీ, వ్యవస్థాపకతకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి గత ఐదు రోజులుగా స్విట్జర్లాండ్ ,జర్మనీలలో పర్యటన విజయవంతంగా విజయవంతంగా ముగించుకొన్న రాష్ట్ర సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుగు పయనమయ్యారు. పర్యటనలో చివరి రోజు శనివారం ఫ్రాంక్ పర్ట్ లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఫ్రాంక్‌ఫర్ట్ వాణిజ్య, పరిశ్రమల ఛాంబర్ (Chamber of Commerce and Industry, Frankfurt) డైరెక్టర్, సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఛాంబర్ ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలు జర్మనీలో మారుతున్న పారిశ్రామిక దృశ్యం, భారతదేశంతో సహకారం కోసం ఉన్న అవకాశాల గురించి చర్చలు జరిగాయి. జర్మనీ ఎదుర్కొంటున్న జనాభా సంబంధిత సవాలు, విదేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి, నైపుణ్యం కలిగిన కార్మికుల పట్ల దానికున్న సుముఖతను ఛాంబర్ నాయకత్వం ప్రముఖంగా తెలియజేసింది.ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను గురించి వివరంగా తెలియజేశామని, రాష్ట్రం చేపడుతున్న చురుకైన విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించామని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర విధానాలపై ఆసక్తి చూపిన ఛాంబర్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు. జర్మన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల మధ్య వ్యాపార సహకారం, ఉమ్మడి వ్యాపారాలను సులభతరం చేయడానికి, విజయవాడలో జర్మనీకి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ఆంధ్రప్రదేశ్ చాప్టర్‌ను స్థాపించాలని కోరామని మంత్రి తెలియజేశారు.
ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO)తో మంత్రి శ్రీనివాస్ బృందం సమావేశం:
ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్ టెక్, మరియు సుస్థిర పారిశ్రామీకరణపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Centre of Excellence) ను ఏర్పాటు చేయడం గురించి UNIDO సీనియర్ ప్రతినిధితో మంత్రి చర్చించారు. ఈ ప్రతిపాదిత కేంద్రం అధునాతన తయారీ పద్ధతులను ప్రోత్సహించడం, అత్యాధునిక సాంకేతికతలను స్వీకరించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమ (MSME)లకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా సాగాయి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు.
అక్సెంచర్ (Accenture), ఇండో-జర్మన్ పారిశ్రామికవేత్తలతో సంభాషణ:
ఫ్రాంక్‌ఫర్ట్‌లోని అక్సెంచర్ క్యాంపస్‌లో 30 మంది సీఈఓల బృందంతో మంత్రి శ్రీనివాస్ బృందం చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క బలమైన విధాన పర్యావరణ వ్యవస్థ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, పారిశ్రామిక ఆవిష్కరణ వంటి ఉద్భవిస్తున్న రంగాలలో పెరుగుతున్న అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రంలో భాగస్వామ్యాలు, పెట్టుబడులను అన్వేషించడానికి సీఈఓలు బలమైన ఆసక్తిని చూపారని మంత్రి తెలిపారు.
ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌లో 20 మంది ఇండో-జర్మన్ పారిశ్రామికవేత్తలతో సమావేశం జరిగిందని, రాష్ట్ర పెట్టుబదులకు ఉన్న అనుకూల వాతావరణం గురించి వివరించామని అన్నారు. నవంబర్ 14,15 తేదీలలో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సు 2025 (Partnership Summit 2025) లో పాల్గొనాలని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు రాష్రానికి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించామని మంత్రి తెలిపారు.
ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న అంతర్జాతీయ పరిధిని, జర్మనీ వంటి ప్రముఖ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలతో బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పర్చుకొనేందుకు, రాష్ట్రం నిబద్ధతను పునరుద్ఘాటిస్థూ సాగిందని మంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో జర్మనీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వర్గాలు రాష్ట్రంలో ఉన్న మౌళిక వస్తుతులు, ప్రభుత్వం చూపుతున్న చొరవతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
