Let's talk: editor@tmv.in
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్డీడీబీ చైర్మన్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్డీడీబీ చైర్మన్ భేటీ

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) చైర్మన్ డాక్టర్ మీనేష్ సి. షా, మదర్ డెయిరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయతీర్థ చారి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు, పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన కీలక చర్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచడం, డెయిరీ రంగంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శ్వేత విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీడీబీ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్డీడీబీ చైర్మన్ భేటీ - Tholi Paluku