Let's talk: editor@tmv.in
మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి: సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు
మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి: సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు
మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి: సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు
మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి: సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు

మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి: సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు

Gaddamidi Naveen
14 జులై, 2026

తెలంగాణలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలు చేపట్టింది. గతంలో కరువుపై ప్రశ్నించినందుకు "రక్తం చల్లితే పంటలు పండుతాయి" అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. "మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి" అనే నినాదంతో తెలంగాణ భవన్, ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో "సీఎం రేవంత్ రెడ్డికి రక్తదాహం" పేరుతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సి. లక్ష్మారెడ్డి, బాల్క సుమన్ తదితర నేతలు హాజరయ్యారు. శిబిరంలో సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో సీఎం క్యాంపు కార్యాలయానికి ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

ముప్కాల్ పంప్ హౌస్ వద్ద వేముల నిరసన

మరోవైపు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పంప్ హౌస్ వద్ద బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. ఆయన స్వయంగా రక్తదానం చేసి, రైతుల రక్తపు సీసాలను, వినతిపత్రాన్ని సీఎంకు పంపాలంటూ ఎస్సారెస్పీ అధికారులకు అందజేశారు.

గోదావరిలో కాళేశ్వరం నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఆ నీటిని ఎల్లంపల్లి ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోయాలని ఆయ‌న పేర్కొన్నారు. కేసీఆర్ నిర్మించిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్‌లు రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరుందని, అందులోంచి వెంటనే 4 టీఎంసీలను విడుదల చేసి వరద కాలువ, కాకతీయ కాలువ, గుత్ప-అలీసాగర్ పథకాల ద్వారా పంటలను కాపాడాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 6 టీఎంసీలు ఉన్నప్పుడే నీళ్లిచ్చామని, ఇప్పుడు 15 టీఎంసీలున్నా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15న జరిగే 'శివమ్' సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకోకపోతే, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని కాలువలు, వాగుల వద్ద రైతులతో కలిసి దశలవారీగా భారీ ఆందోళనలు చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

ట్యాగ్‌లు
KaleshwaramKaleshwaramProjectSRSPTelanganaFarmersSaveFarmersWaterForFarmersFarmerIssuesBRSBRSVHarithaTelanganaIrrigation
మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి: సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు - Tholi Paluku