Let's talk: editor@tmv.in
మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

Gaddamidi Naveen
13 మార్చి, 2026

తెలంగాణలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులను ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15, నుంచి ఏప్రిల్ 23, 2026 (విద్యా సంవత్సరం చివరి పనిదినం) వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, హైస్కూల్‌లలో ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పనిచేస్తాయి. అనంతరం మధ్యాహ్న భోజనం (మిడ్‌డే మీల్) విద్యార్థులకు అందజేయనున్నారు. మార్చి నెలలో జరగనున్న ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

అలాగే ఎస్‌ఎస్‌సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం 1.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. వేసవి తీవ్రత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు - Tholi Paluku