
మార్కెట్లోకి మహీంద్రా నుంచి నయా థార్
వాహనాలలో ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా మహీంద్రా థార్ కు ఉన్న క్రేజ్ సెపరేట్ అనే చెప్పాలి. చూడటానికి వెంటనే ఆకర్షించేలా నమూనా, స్టైలిష్ అప్పియరెన్స్ తో పాటు థార్ లో ప్రయాణించే వారు చాలా డైనమిక్ గా కనిపిస్తారు అనేది థార్ ను ఇష్టపడే వారి అభిప్రాయం. ఎందుకంటే ఎంత మందిలో ఉన్న మిమ్మల్ని మీ స్టైల్ ని స్పెషల్ గా చూపించాలి అనుకునే వారు థార్ స్పెషల్ ను ఫీల్ అవుతారు.
ఒకవేళ మీరు కూడా మహీంద్రా థార్ కు అభిమానులే ఐతే ఈ శుభ వార్త మీకోసమే. దాదాపు ఐదేళ్ల క్రితం రోడ్డెక్కిన థార్ ఇప్పుడు మరింత ఆధునిక లుక్, సౌకర్యవంతమైన ఫీచర్లతో మళ్లీ దూసుకొచ్చింది. ఈ కొత్త మోడల్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్, ఆధునిక సేఫ్టీ ఫీచర్లతో డిజైన్ చేయబడింది.
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి సంచలనంగా నిలిచింది మహీంద్రా అండ్ మహీంద్రా. ప్రముఖ ఆఫ్‌రోడర్ థార్ కి సరికొత్త వెర్షన్‌ను అధికారికంగా ఇటీవలే విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త మోడల్ ధరను సంస్థ రూ. 9.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షలు వరకు నిర్ణయించింది. నగర రోడ్లకే కాదు, ఆఫ్‌రోడ్ అడ్వెంచర్‌లకూ తగిన ఈ కొత్త థార్ రూపంలో, రోడ్ ప్రెజెన్స్‌లో, టెక్ ఫీచర్లలో మరింత ఆకట్టుకునేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
