Let's talk: editor@tmv.in
మాధాపూర్ డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి 11 మంది అరెస్ట్

మాధాపూర్ డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి 11 మంది అరెస్ట్

Gaddamidi Naveen
5 నవంబర్, 2025

రంగారెడ్డి జిల్లా మాధాపూర్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమ‌వారం రాత్రి చోటుచేసుకుంది. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఆధ్వర్యంలో మాధాపూర్ పోలీసులు ఈ దాడి నిర్వహించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, మాధాపూర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ప్రాంగణంలో యువత డ్రగ్స్‌తో పార్టీ జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి చేపట్టారు. ఘటన స్థలంలో డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.మేము మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నాము. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని మాధాపూర్ పోలీస్ అధికారి తెలిపారు. డ్రగ్స్ సరఫరా మూలాలు, ఇందులో ఉన్న వ్యక్తుల నేపథ్యాలు, ఇతర లింకులు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో బ్యాంకు మోసం కేసులో ఎస్‌బీఐ ఉద్యోగికి శిక్ష

ఇక మరో ఘటనలో, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం హైదరాబాద్‌లో బ్యాంకు మోసం కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), చందులాల్ బారదారీ బ్రాంచ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన వి. చలపతిరావుకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో రూ.36,000 జరిమానా విధించింది.

సీబీఐ 2002 మే 1న చలపతిరావుతో మ‌రో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. 1996–2000 మధ్య చలపతిరావు అప్పటి బ్రాంచ్ మేనేజర్ పి.పీ.కృష్ణరావు, అలాగే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి నకిలీ పత్రాల ఆధారంగా రూ.50 లక్షల విలువైన “బిగ్ బై లోన్స్” మంజూరు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.

చలపతి రావు 2005 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఉన్న కేసులు సిసి నెం. 08/2006, 09/2006 కింద వేరు చేయబడ్డాయి. మిగిలిన నిందితులపై ఉన్న కేసులు గతంలోనే పరిష్కరించబడ్డాయి. కోర్టు వేగవంతమైన విచారణ నిర్వహించి, అక్టోబర్ 31, 2025న నిందితుడిని దోషిగా నిర్ధారించి, రెండు సంవత్సరాల కఠిన శిక్ష ఖరారు చేసింది.

మాధాపూర్ డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి 11 మంది అరెస్ట్ - Tholi Paluku