Let's talk: editor@tmv.in
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి

Pinjari Chand
20 నవంబర్, 2025

దేశంలో ఇందిరాగాంధీ జయంతిని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానిగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా ఆమెకు శక్తిస్ఠల్ లో ఘన నివాళి అర్పించారు. ఆమె నాయకత్వ పటిమ, అశేష ప్రజాసేవ , భారత దేశ అభివృద్ధికి తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర నాయకులు నివాళులు అర్పించారు.

ఖర్గే సోషల్ మీడియా అయిన ఎక్స్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ఇందిరా గాంధీ అద్భుతమైన, ఆమె చూపిన రాజకీయ ధైర్యం, తీసుకున్న ప్రబలమైన నిర్ణయాలు, చాలా గొప్పవిగా నిలిచాయి, ఎల్లప్పుడూ ప్రజలకు ప్రేరణగా నిలిచారని. ఆమె తీసుకున్న స్థిరమైన నిర్ణయాలు భారత దేశ ప్రగతి మార్గంలో చెరగని ముద్ర వేశాయి.. దేశ ఐక్యత, సమగ్రతను రక్షించడంలో ఆమె త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఖర్గే ఆమెకు నివాళి అర్పించారు.

ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతుల జన్మించారు. 1966–1977, 1980–1984 మధ్య భారత ప్రధానిగా పని చేశారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధాన మంత్రిగా నిలిచారు.ఆమె హయాంలో బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి ఆర్థిక, సామాజిక సంస్కరణలను చేపట్టారు. ‘భారత ఐరన్ లేడీ’గా ప్రసిద్ధి చెందిన ఇందిరా గాంధీ స్వాతంత్ర్య సంగ్రామంలో క్రియాశీలక పాత్ర వహించారు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యానికి ఆదేశాలిచ్చి, స్వతంత్ర బంగ్లాదేశ్ స్థాపనకు కృషి చేశారు. 1967లో భారత్-చైనా మధ్య యుద్ధం, 1975లో సిక్కిం భారతదేశంలో విలీనం అయ్యేలా చర్యలు చేపట్టారు.

ఇందిరా గాంధీకి,రాణి లక్ష్మీబాయికి ప్రధాని మోడీ నివాళులు

ప్రధాని నరేంద్ర మోడీ భారత తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా బుధవారం నివాళులు అర్పించారు. అలాగే వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. దేశం స్వాతంత్ర్య సంగ్రామంలో ఆమె చూపిన ధైర్య సహసాలను ఎప్పటికీ దేశం మరిచిపోదు అని ఎక్స్ లో పోస్టు చేశారు. ఆమె ప్రదర్శించిన ధైర్యం, వీరత్వం భారతీయుల హృదయాలను ఇప్పటికి ఉత్తేజంతో నింపుతున్నాయని అన్నారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్లో

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నాయకులు కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు.