Let's talk: editor@tmv.in
మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు పురస్కార౦, గ్రూప్-1 హోదా

మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు పురస్కార౦, గ్రూప్-1 హోదా

Dantu Vijaya Lakshmi Prasanna
18 డిసెంబర్, 2025

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లి నివాసంలో అందజేశారు. అంతేకాకుండా కడప నగరంలో 1000 చదరపు గజాల ఇంటి స్థలం, దానితోపాటు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.

కాగా వరల్డ్ కప్‌లో సత్తాచాటిన మహిళా క్రికెటర్ శ్రీచరణిపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను ఇదివరకే ప్రకటించింది.