Let's talk: editor@tmv.in
మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

Gaddamidi Naveen
1 ఫిబ్రవరి, 2026

నగరంలో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో హైదరాబాద్ షీ టీమ్స్ సిబ్బందికి ఒక ప్రత్యేక రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తాజా నివేదిక ప్రకారం ఇతర అధికారులు నేతృత్వం వహిస్తున్నారు.హైదరాబాద్ అదనపు కమిషనర్ ఎం. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్.జె.పి ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది.

ఈ శిక్షణలో బాధితులతో వ్యవహరించేటప్పుడు అత్యంత సున్నితంగా, సానుభూతితో గౌరవప్రదంగా ఉండాలని ఈ శిక్షణలో సిబ్బందికి సూచించారు. మహిళల భద్రతా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా, చట్టబద్ధమైన బాధితుల కేంద్రంగా అమలు జరగాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎన్‌ఎస్, ప్రత్యేక చట్టాలు, బాధితుల సహాయం, సాఫ్ట్ స్కిల్స్, స్వీయ రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన, సాంకేతిక సాధనాల వినియోగం, షీ పోర్టల్ నిర్వహణ వంటి అంశాలపై నిపుణుల ఉపన్యాసాలు, ప్రాయోగిక శిక్షణలు అందించారు. డీకాయ్ కేసులు, రెడ్ హ్యాండెడ్ కేసుల నిర్వహణ వంటి ఫీల్డ్ ప్రాక్టీసులపై అనుభవజ్ఞులైన రిటైర్డ్ పోలీస్ అధికారులు, న్యాయ నిపుణులు, సైబర్ క్రైమ్ స్పెషలిస్టులు, కౌన్సిలర్లు శిక్షణ ఇచ్చారు.

భద్రతా సూచనలు:

ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలి. ఆన్‌లైన్‌లో నకిలీ ప్రొఫైళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పంచుకోవద్దు. బలమైన పాస్‌వర్డ్లు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలి. స్టాకింగ్, వేధింపులు, దుర్వినియోగం ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. అవసరమైన వారు సాయం కోసం డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490616555 ను సంప్రదించవచ్చు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - Tholi Paluku