
మహిళల క్లబ్ వరల్డ్ కప్ 2028 జనవరిలో..
ఫిఫా మహిళల క్లబ్ వరల్డ్ కప్ 2028లో జనవరిలో జరుగుతుందని ప్రకటించింది. దీనికి హోస్ట్ ఏ దేశం అని ఇంకా ఖరారు కాలేదు, కానీ ఆ సమయంలో వేడి వాతావరణం ఉన్న దేశంలో దీన్ని ఏర్పాటు చేయవచ్చు అని వుంది. ఈ పోటీ 2028 జనవరి 5 నుండి 30 వరకు జరుగుతుంది.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. మొదట నాలుగు గ్రూపులుగా జట్లు విభజించబడతాయి, ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. తర్వాత క్వార్టర్ ఫైనల్స్ నుండి పోటీ నాకౌట్ విధానంలో కొనసాగుతుంది. పోటీలో ముందే ఆరు జట్లు “ప్లే-ఇన్” దశలో పోటీ పడతాయి, వీటిలో మూడు జట్లు ప్రధాన పోటీలోకి ప్రవేశిస్తాయి.
యూరోప్ ఖచ్చితంగా ఐదు జట్లను పంపుతుందని ఫిఫా నిర్ణయించింది. ఆసియా, ఆఫ్రికా, కాన్కకాఫ్, దక్షిణ అమెరికా ప్రతి ఖండం నుండి రెండు జట్లు పాల్గొంటాయి. ప్లే-ఇన్ దశలో ఐదు ఖండాల జట్లు ,ఓషియానియా నుండి ఒకటి కూడా పాల్గొంటాయి.
ఈ టోర్నమెంట్ సమయంలో కొన్ని యూరోపియన్ దేశాల మహిళల లీగ్‌లు కొనసాగుతాయి. ఉదాహరణకు ఇంగ్లాండ్ ఉమెన్స్ సూపర్ లీగ్ టోర్నమెంట్‌లతో క్లాష్ జరగవచ్చు , కానీ వుమెన్స్ చాంపియన్స్ లీగ్ జనవరిలో విరామంలో ఉంటుంది. అమెరికా ఎన్డబ్ల్యుఎస్ఎల్ ఆ సమయంలో ఆఫ్‌సీజన్‌లో ఉంటుంది.
ఫిఫా కౌన్సిల్ దోహాలో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల క్లబ్ వరల్డ్ కప్ ప్రారంభం క్రీడాకారిణులకు, అభిమానులకు ప్రపంచ స్థాయి ఉత్సాహాన్ని అందించే అవకాశంగా మారనుంది.
