Let's talk: editor@tmv.in
మహాలక్ష్మీ పథకంతో మళ్లీ దూసుకెళ్తున్న ఆర్టీసీ

మహాలక్ష్మీ పథకంతో మళ్లీ దూసుకెళ్తున్న ఆర్టీసీ

Gaddamidi Naveen
9 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి ఊహించని జీవం పోసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో సంవత్సరాలుగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ, ఈ పథకం ద్వారా తిరిగి లాభాల బాటలోకి అడుగుపెడుతోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించడం ద్వారా ఈ పథకం ప్రజల్లో విశేష ఆదరణ పొందిందన్నారు.

ఈ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక భారం భరిస్తున్నా, దీని వల్ల ఏర్పడిన సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు గణనీయంగా కనిపిస్తున్నాయని నెలకు సుమారుగా రూ.165 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నారు. మహిళల సామాజిక స్థితిగతుల్లో వచ్చిన మార్పు, రవాణా సేవల వినియోగం పెరగడం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రత్యేకించి మహిళలు ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు మొదలైన అవసరాల కోసం మామూలు కంటే ఎక్కువగా బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో టికెట్ ఆదాయం రాకపోయినా,ప్రయాణికుల నుండి వచ్చే ఆదాయం, నూతన ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో ఆర్టీసీకి నిర్వహణ ఖర్చులు తగ్గాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకంగా నిలుస్తోందని పర్యావరణ పరిరక్షణతో పాటు, ఈ బస్సులు ఆర్టీసీకి దీర్ఘకాలికంగా ఆర్థిక లాభాలను కల్పిస్తున్నాయనిడీజిల్ బస్సులతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో వ్యయాన్ని తగ్గించవచాన్నారు. ఆర్టీసీ సిబ్బందికి వేతనాలు, భద్రత, పింఛన్ వంటి సంక్షేమ పథకాలకూ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కార్మికుల ఆందోళనలు తగ్గించి, వారి సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి (సంవత్సరాల వారీగా)

*సంవత్సరం

ఆదాయం (రూ.కోట్లు)

నష్టం/లాభం (రూ.కోట్లు)

అప్పులు (రూ.కోట్లు)*

2020‌‌‌‌-21

-3,300

పెద్ధ నష్టం కరోనప్రభావం

6,000

2021-22

3,311

-

-

2022-23

5,879

నష్టం తగ్గింపు

1,995

2023-24

8,127

529.20 లాభం

9.897.55

2024-25(అంచనా) 9000+(లక్ష్యం) 709.29 లాభం

తగ్గే అవకాశం

2022 వరకు తెలంగాణ ఆర్టీసీ భారీ నష్టాల్లో ఉండగా, 2023 తరువాత మహాలక్ష్మి ఉచిత బస్సు రవాణా వల్ల ప్రయాణికుల సంఖ్య పెరగడం, ప్రభుత్వ విరాళాలు వలన ఆదాయం పెరిగింది. 2024 నుండి సంస్థ లాభాల్లోకి ప్రవేశించింది అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అలాగే ఆర్టీసీ బస్సు చార్జీల పెంచడం వల్ల ప్రయాణికులు మెట్రో రైలు ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ, మెట్రో రైలు చార్టీలు ఇంచు మించు సమానంగా ఉండడం వల్ల అలాగే ట్రాఫీక్ సమస్యలను అధికమించడనికి మెట్రో ప్రయాణం కొనసాగిస్తున్నారు.

మహాలక్ష్మీ పథకంతో మళ్లీ దూసుకెళ్తున్న ఆర్టీసీ - Tholi Paluku