
మహాకూటమిపై బిజెవైఎమ్ వ్యంగ్యాస్త్రాలు, ప్రధాని మోదీ 'కట్టా' విమర్శ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు, భారతీయ జనతా యువ మోర్చా శనివారం ఒక కార్టూన్ ద్వారా మహాకూటమి పై విమర్శలు గుప్పించింది. ఈ కార్టూన్‌లో, ఆర్ జె డి నాయకుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తుపాకీ ఎత్తి పట్టుకుని, బీహార్ ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ కార్టూన్‌కు తోడుగా ఆర్ జె డి కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి పదవిని అప్పగించేలా బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఒక శీర్షికను ప్రచురించారు.
"కాంగ్రెస్ నుదుటిపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి పదవిని లొంగిపోయేలా ఆర్ జె డి బలవంతం చేసింది" అని భారతీయ జనతా యువ మోర్చాపేర్కొంది.
ఇది ఇలా ఉంటే బీహార్ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెట్టియాలో ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఈ ర్యాలీలో, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీల 'జంగల్ రాజ్' అత్యంత భయంకరమైన రూపాన్ని బెట్టియా చూసిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ "జంగల్ రాజ్" రాజకీయ నాయకులు ఒకప్పుడు సత్యాగ్రహ చరిత్రకు ప్రసిద్ధి చెందిన చంపారన్‌ను గూండాలు, దొంగలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఇక్కడ నిత్యం హత్యలు జరుగుతూ ఉండేవి. అక్కాచెల్లెళ్ళు, కుమార్తెలు ఇంటి నుండి బయటకు రావడానికి కష్టంగా ఉండేది," అని ప్రధాని మోదీ అన్నారు. ముఠాలు వసూళ్ల పాలన ఎక్కడ ఉంటుందో, అక్కడ యువత కలలు చెదిరిపోతాయని, గూండాల ఉనికి వ్యాపార, వాణిజ్యాలను నిలిపివేస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
"నేను మీకు ఈ విషయాలన్నీ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే చట్ట పాలన అంతమైతే, మొదట ఎక్కువగా బాధపడేది పేదలు, వంచితులు, కష్టాలు పడేవారే అన్నారు. మీరు నితీష్ జీ నాయకత్వంలో ఎన్డీఏ యొక్క సుపరిపాలనను చూశారు, మీరు శాంతిని చూశారు, బీహార్ ప్రజలు ఉపశమనం పొందారు. కానీ, దీనిని జంగల్ రాజ్ నుండి దూరంగా ఉంచడం మనందరి బాధ్యత అన్నారు. బీహార్‌ను ఇంకా అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది," అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ నేను సీతామాత పుట్టిన "పవిత్ర భూమి" నుండి మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆమె ఆశీస్సులు బీహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి సహాయపడతాయని చెప్పారు. "ఈ రోజు, నేను మీ ఆశీస్సుల కోసం ఈ సీతామాత ఉన్న పవిత్ర భూమికి వచ్చాను, కాబట్టి ఇంతటి ఉత్సాహంతో నిండిన ప్రజల మధ్య ఆ రోజులు గుర్తుకు రావడం సహజం. ఈ ఎన్నికలు రాబోయే సంవత్సరాల్లో బీహార్ పిల్లల భవిష్యత్తును, మీ సంతానం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దానికోసం ఇప్పుడు ఈ ఎన్నికలు చాలా ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు.
ఎన్ డి ఏ విజయాన్ని ధృవీకరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మహాకూటమిపై తన "కట్టా" (తుపాకీ) విమర్శను మళ్ళీ అస్త్రంగా వాడారు."నహీ చాహియే కట్టా సర్కార్, ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్" (కట్టా సర్కార్ వద్దు, మరోసారి ఎన్డీఏ సర్కార్ కావాలి) అని ప్రకటించారు.
జంగిల్ రాజ్ కు "65-వోల్ట్ల షాక్"
ఈ భారీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మొదటి దశ పోలింగ్‌లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడాన్ని కొనియాడారు, ఇది జంగిల్ రాజ్"కు ప్రాతినిధ్యం వహించే వారికి "65-వోల్ట్ల షాక్" ఇచ్చిందని అన్నారు. బీహార్ యువత అభివృద్ధిని,ఎన్ డి ఏ ను ఎంచుకుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. బీహార్ సోదరీమణులు, కుమార్తెలు కూడా ఎన్ డి ఏ రికార్డు విజయాన్ని ఖాయం చేశారు" అని ప్రధాని మోదీ అన్నారు.
నేడు సీతామర్హిలో వాతావరణం "హృదయానికి హత్తుకునేలా" ఉందని, ఇది ఎన్డీఏకు ప్రజల స్పష్టమైన మద్దతును ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ వాతావరణం కూడా ఒక సందేశాన్ని ఇస్తోంది అన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ పై విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ చిన్న పిల్లలను "రంగదార్" (నేరస్తులు)గా మార్చాలని చూస్తోందని, వారి ఎన్నికల ప్రచారమే దీనికి సాక్ష్యమని ప్రధానమంత్రి ఆరోపించారు. "ఆర్ జె డి ప్రజలు బీహార్ పిల్లల కోసం ఏమి చేయాలనుకుంటున్నారో వారి నాయకుల ఎన్నికల ప్రచారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జంగిల్ రాజ్ ప్రజల పాటలు, నినాదాలను వినండి. వారు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి చెబుతున్నారో విని మీరు వణికిపోతారు. ఆర్ జె డీ వేదికలపై, అమాయక పిల్లలను 'రంగదార్' (నేరస్తులు) కావాలని చెప్పిస్తున్నారు" అని ఆయన అన్నారు.
బీహార్ పిల్లలు "రంగదార్" (నేరస్తులు)గా మారకుండా, బదులుగా ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు లేదా న్యాయమూర్తులుగా కోర్టులో నిలబడతారని ప్రధానమంత్రి గట్టిగా చెప్పారు. సీతామర్హిలో తన ర్యాలీ ముగిసిన తర్వాత, ప్రధానమంత్రి మరో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడానికి బెట్టియాకు వెళ్తారు. బీహార్ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతంగా నమోదైన 65.08 శాతం ఓటింగ్ తో బీహార్ ఎన్నికల మొదటి దశ ఇటీవల ముగిసింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 11న 122 స్థానాలకు జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడనున్నాయి.
