
మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్
మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఇటీవల భారతదేశ 12 వ ఉప రాష్ట్రపతిగా వెళ్లడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఖాళీ ఎర్పడింది. దీంతో గుజరాత్ గవర్నర్గా ఉన్న ఆచార్య దేవవ్రత్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ గా నియమించారు. సోమవారం ఉదయం ముంబైలోని రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
అదనపు బాధ్యతలు
మహారాష్ట్ర గవర్నర్ గా గుజరాత్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనతో ముంబై హైకోర్టు చీప్ జస్టిస్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. ఆచార్య దేవవ్రత్ పంజాబ్ లో 1959, జనవరి 18న జన్మించారు. ఈయన ఉన్నత చదువులు చదివారు. ఆర్యసమాజ్ లో ప్రచారక్ గా , హర్యానాలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారు. తదనంతరం గుజరాత్ లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఛాన్సలర్ గా విధులు నిర్వర్తించారు. 2015 నుంచి 2019 వరకు హిమాచల్ గవర్నర్ గా ఉన్నారు. తర్వాత గుజరాత్ గవర్నర్ గా నియమించారు. ఇప్పుడు మహారాష్ట్ర లో కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఫోటో రైటప్; గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆచార్య దేవవ్రత్
