Let's talk: editor@tmv.in
మహబూబ్‌నగర్‌లో ‘సాయి ఆరోగ్య’ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌లో ‘సాయి ఆరోగ్య’ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

Gaddamidi Naveen
1 ఫిబ్రవరి, 2026

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదపల్లి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో శనివారం సాయి ఆరోగ్య 50 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. ‘వన్ మిషన్ వన్ ఫ్యామిలీ మిషన్’ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయితో కలిసి స్థానిక ఎంపీ డీకే అరుణ ఈ కార్యక్రమంలో పాల్గొని భూమిపూజ నిర్వహించారు.

మధుసూదన సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, జయరామ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ.. పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం అభినందనీయమన్నారు. 50 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే, పాలమూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఆమె ఆకాంక్షించారు.

ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవలో సద్గురు మధుసూదన్ సాయి చేస్తున్న కృషిని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో జయరామ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే జిల్లాలో వైద్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి.

మహబూబ్‌నగర్‌లో ‘సాయి ఆరోగ్య’ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన - Tholi Paluku