
మహాఘట్బంధన్ లో గందరగోళం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయాల్లో అనుహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మహాఘట్బంధన్(కూటమి)తో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఈ సారి కూటమిలో పార్టీలు పెరినందున సీట్ల విషయంలో త్యాగాలు చేయాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అందుకనుగుణంగా మేం కూడా ముందుంటామని సూచనప్రాయంగా తెలిపారు. అయితే తాజాగా ఆయన ముజఫర్ పూర్ లోని కాంతి లో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ సారి ఆర్జేడీ రాష్ట్రంలోని 243 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించి అందరిని షాక్ కు గురిచేశారు. అంతే కాకుండా నియోజకవర్గాల్లోని తమ పార్టీ అభ్యర్థులను చూడవద్దని, తనను చూసి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. తేజస్వీ ప్రకటన వల్ల కూటమిలో పార్టీలు ఆయోమయంలో పడ్డాయి. తదుపరి అనుసరించాల్సిన విధానాలను గురించి చర్చిస్తున్నాయి. కాంతిలో జరిగిన బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్డీయే ప్రభుత్వం పై విమర్శలు
ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించారు. బీహార్ ఓట్లు, గుజరాత్ కు కంపెనీలు అని ఎద్దేవా చేశారు. తన పథకాలను సీఎం నితీశ్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. మై బెహన్ యోజనను నితీశ్ కాపీ కొట్టారని గుర్తు చేశారు. అలాగే ఎన్డీయే ప్రభుత్వం సుమారు రూ. 80 వేల కోట్ల లెక్కల చూపెట్టడం లేదని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
