Let's talk: editor@tmv.in
మసాజ్ సెంటర్ల పేరుతో.. నేరాలు

మసాజ్ సెంటర్ల పేరుతో.. నేరాలు

FL - YUGDR
24 సెప్టెంబర్, 2025

రాష్ట్రంలో అతి పెద్దదైన విశాఖ మహానగరంలో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచార కార్యకలాపాలు జోరందుకున్నాయి. గత ఏడాది కాలంలో కొందరు నేతల మద్దతుతో వందల సంఖ్యలో మసాజ్ సెంటర్లో పుట్టుకు రావడం, అందులో వ్యభిచారం జరుగుతుందంటూ ఫిర్యాదులు రావడం సర్వసాధారణం అయిపోయింది. దీంతో నగరంలో మసాజ్ సెంటర్లు, లాడ్జిలపై పోలీసులు నిఘా పెంచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నా యనే ఫిర్యాదులు అందుతుండడంతో సీపీ శంఖబ్రతబాగ్చీ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో హోటళ్లు/లాడ్జిలు, మసాజ్ సెంటర్లపై వేరొక స్టేషన్ పరిధిలోని పోలీసులతో ఆకస్మిక దాడులు చేయిస్తున్నారు. వారికి అదనంగా టాస్క్ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇటీవల కాలంలో వరుసగా చీకటి కార్యకలాపాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో థాయ్ స్పా, ఆయుర్వేదిక్ స్పా సెంటర్లు బాగా పెరిగిపోయాయి.

ఉద్యోగులే యజమానులు

ఒక మసాజ్ సెంటర్లో పనిచేసినవారు అక్కడ యజమానులకు వచ్చే ఆదాయాన్ని చూసి తాము కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. కొంతమంది కస్టమర్లతో పరిచయాలు పెంచుకున్న తర్వాత సొంత దుకాణం తెరు స్తున్నారు. నగరంలో ప్రస్తుతం 350కి పైగా మసాజ్ సెంటర్లు ఉన్నాయి. కాస్మోటిక్ అండ్ బ్యూటీషియన్ యాక్ట్కు లోబడిన సేవలను మాత్రమే మసాజ్ సెంటర్లలో అందజేయాలి. సెంటర్ ఏర్పాటుతోపాటు లోపల సదుపాయాల కల్పన కూడా యాక్ట్ పేర్కొన్నట్టుగానే ఉండాలి. కానీ మసాజ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం స్పాల్లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహించి కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలుచేస్తున్నారు.

పోలీసులతో తాము అవగాహన ఏర్పరచుకున్నందున దాడుల భయం ఉండదని కస్టమర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలు జరుగుతున్నట్లు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే నగరంలోని కొన్ని హోటళ్లు/ లాడ్జిల్లో పేకాట, వ్యభిచారం నడుస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపకపోతే సమస్య మరింత తీవ్రంగా మారి నగరంలో శాంతిభద్రతల సమస్యకు దారితీయడం ఖాయమని గుర్తించిన సీపీ శంఖబ్రతబాగ్ని హోటళ్లు/లాడ్జిలు, మసాజ్ సెంటర్లపై నిఘా పెట్టాలని అధికా రులను ఆదేశించారు. స్టేషన్ పరిధిలో మసాజ్ సెంటర్లు, హోటళ్లు/ లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారిదేనని, ఏదైనా తేడా వస్తే అందుకు బాధ్యుడిని చేస్తానని సీపీ హెచ్చరించారు.

పక్క స్టేషన్స్ సిబ్బందితో దాడులు

అంతేగాకుండా ఒక స్టేషన్ పరిధిలోని హోటళ్లు/ లాడ్జిలు, మసాజ్ సెంటర్లపై మరొక పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందితో ఆకస్మిక దాడులు చేయిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇదే తరహాలో ఆకస్మిక సోదాలు జరుగు తుండడంతో వరుసగా చీకటి కార్యకలాపాలు బయటపడుతున్నాయి. కొద్దిరోజు ల కిందట నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో గల లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు బయట పడగా, మరో స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్లో వ్యభిచారం గుట్టు రట్టయింది. తాజాగా నగర శివారునున్న పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక మసాజ్ సెంటర్లో లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడి తోపాటు ఒక విటుడిని, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులు కొనసాగు తాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

మసాజ్ సెంటర్ల పేరుతో.. నేరాలు - Tholi Paluku