Let's talk: editor@tmv.in
మలేషియాలో ఘనంగా 47వ ఆసియాన్ సమ్మిట్

మలేషియాలో ఘనంగా 47వ ఆసియాన్ సమ్మిట్

Yekkirala Akshitha
27 అక్టోబర్, 2025

కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుండి 28 వరకు జరుగుతున్న 47వ ఆసియాన్ సమ్మిట్ 2025 ఇండో- పసిఫిక్ దౌత్యం మైలురాయిగా నిలిచింది. 1967లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ కలిసి ఈ వేదికను స్థాపించగా, ప్రస్తుతం ఇరవై నెలుగు సభ్యులుగా మారింది. మలేషియా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తూ, ఆసియాన్ వృద్ధికి ప్రధాన శక్తిగా మారబోతుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆసియాలో తన రెండవ టర్మ్ మొదటి పర్యటనలో భాగంగా మలేషియాకు వచ్చారు. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ట్రంప్ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీమ్‌తో కలిసి సంప్రదాయ నృత్యంలో పాల్గొనడం విశేషం. ఈ సాంస్కృతిక సందర్భం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఆసియాన్, 1967లో శాంతి, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ సహకారం కోసం కోల్డ్ వార్ కాలంలో ఏర్పడింది. బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా, ఇటీవలే ఈస్ట్ టిమూర్ సభ్యులుగా భాగమయ్యారు. దశాబ్దాలుగా, ఆసియాన్ ప్రాంతీయ సహకారంలో, మల్టిలేటరలిజాన్ని, అర్ధిక సమన్వయాన్ని మెరుగుపరిచింది.

భారతదేశం ప్రారంభంలో ఆసియాన్‌పై తక్కువ ప్రాముఖ్యతనిచ్చినప్పటికీ, తర్వాత కీలక భాగస్వామిగా అభివృద్ధి చెందింది. ప్రధాని నరేంద్ర మోడీ 2025లో వర్చువల్‌గా పాల్గొని, ఆసియాన్-ఇండియా సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నైపున్యంగా ముందుకు తీసుకువెళ్లారు. ఆయన ప్రసంగంలో వాణిజ్య సహకారం, సాంస్కృతిక బంధాలు, ఇండో-పసిఫిక్ ఉమ్మడి దృష్టిని హైలైట్ చేశారు. 2026ను ఆసియాన్-ఇండియా సముద్ర భాగస్వామ్య సంవత్సరం అంటూ ప్రకటించారు.

సమ్మిట్ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, మలేషియా, థాయ్‌లాండ్, కంబోడియాల‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. టారిఫ్ తగ్గింపు, ముఖ్య ఖనిజాల పరస్పర సహకారం, చైనా ప్రభావానికి ఎదురు కావడానికి చర్యలు ప్రారంభించారు. సమ్మిట్‌ సైడ్‌లైన్లలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, దక్షిణ కొరియా మంత్రి చో హ్యూన్‌తో రక్షణ, సెమికండక్టర్ చైన్ పై కీలక చర్చలు జరిపారు. అమెరికా, పాకిస్థాన్‌తో సంబంధాలు పెంచుకుంటున్నా, భారతదేశంతో సంబంధాలు తగ్గించేది లేదని అమెరికా స్టేట్ సెక్రటరీ రుబియో చెప్పారు. కౌలాలంపూర్‌లోని ప్రజాప్రదర్శనల్లో పలు అంతర్జాతీయ సంఘర్షణలు కూడా చర్చకు వచ్చాయి.

ఈ ఆసియాన్ సమ్మిట్ లో రాజనీతి, వాణిజ్య, సాంస్కృతిక, భద్రతా సంబంధ పెట్టుబడుల గురించి విస్తృతంగా చేర్చలు జరిగాయి. మలేషియా ఆధ్వర్యం, ట్రంప్ ప్రత్యక్ష భాగస్వామ్యం, మోదీ ఆకర్షక వర్చువల్ సామాజిక భాగస్వామ్యంతో ఆసియాన్ మల్టిలేటరల్ డైలాగ్‌లో కీలక పాత్ర పోషించనుంది.

మలేషియాలో ఘనంగా 47వ ఆసియాన్ సమ్మిట్ - Tholi Paluku