Let's talk: editor@tmv.in
మారుతీ కొత్త ఎస్యూవీ 'విక్టోరిస్' లాంచ్

మారుతీ కొత్త ఎస్యూవీ 'విక్టోరిస్' లాంచ్

Shaik Mohammad Shaffee
19 సెప్టెంబర్, 2025

ఫ్యామిలీ కార్లకు పెట్టింది పేరు మారుతీ సుజుకీ. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కూడా ఈ కార్ల ధరలు అందుబాటులో ఉంటాయి. తాజాగా ఈ సంస్థ తమ ఎస్యూవీ కేటగిరీలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కారును విడుదల చేసింది. అదే మారుతీ సుజుకీ విక్టోరిస్. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి మొదలవుతుంది. దీని అధికారిక అమ్మకాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే ఈ కొత్త ఎస్యూవీ కోసం బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఈ కారులో చాలా ప్రత్యేకతలున్నాయి. సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది.

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారు గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్ సాధించి, మారుతీ సుజుకీ చరిత్రలోనే అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. వేరియంట్ల వారీగా ధరలు గమనిస్తే, మారుతీ సుజుకీ విక్టోరిస్లో ఎల్​ఎక్స్​ఐ, వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ(ఓ), జెడ్​ఎక్స్​ఐ ప్లస్​, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​(ఓ) వంటి పెట్రోల్ అండ్ హైబ్రిడ్ వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్​ వేరియంట్ల ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 17.77 లక్షల వరకు ఉన్నాయి. ఆల్ వీల్​ డ్రైవ్​ ఆప్షన్​ రూ.18.64 నుంచి మొదలవుతుంది. సీఎన్జీ ఆప్షన్ ధర రూ.11.50 లక్షల నుంచి మొదలవుతుంది. హైబ్రిడ్ టాప్ ఎండ్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

కారు ఇంటీరియర్ ప్రీమియం లుక్లో ఉంటుంది. కారు లోపల 64 యాంబియెంట్​ లైట్​ కలర్​ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. డ్యాష్ బోర్డుపై 10.25 ఇంచుల డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లేతో పాటు 35 ప్రీలోడెడ్ యాప్స్తో కూడిన టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ ఉంటుంది. అలాగే కారు పైన డ్యూయల్​ పేన్​ సన్రూఫ్​, పీఎం 2.5 ఎయిర్​ ఫిల్టర్​, 8 స్పీకర్​ సరౌండ్​ సౌండ్​ విత్​ డాల్బీ అట్మోస్​, 8వే పవర్డ్​ వెంటిలేటెడ్​ సీట్లు ఉంటాయి.

ఫీచర్లు, మైలేజ్

మారుతీ సుజుకీ విక్టోరిస్లో గ్రాండ్​ విటారాలో ఉండే ఇంజిన్నే దీనికీ అమర్చారు. ఇందులో 1.5లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.5లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ అనే రెండు పవర్ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.5ఎల్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 103 హెచ్పీ శక్తిని, 139 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్​బాక్స్తో వస్తుంది. అలాగే 1.5ఎల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ 92.5 హెచ్పీ శక్తిని, 122 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ-సీటీవీ గేర్బాక్స్తో వస్తుంది. ఈ కారుకి పెట్రోల్ ట్యాంక్తో పాటు అండర్​బాడీ సీఎన్జీ ట్యాంక్ కూడా ఉంటుంది.

ఇక కారు మైలేజీ విషయానికి వస్తే, విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఉన్న వేరియంట్లలో టాప్ ప్లేస్లో నిలిచింది. ఇది ఏఆర్ఏఐ పరీక్షల ప్రకారం 28.56 కి.మీ./లీ. మైలేజీని ఇస్తుంది. విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్ 27.02 కి.మీ./కేజీ, 1.5ఎల్ ఎన్ఏ పెట్రోల్ (మ్యాన్యువల్): 21.18 కి.మీ./లీ, 1.5ఎల్ ఎన్ఏ పెట్రోల్ (ఆటోమేటిక్): 21.06 కి.మీ./లీ, 1.5ఎల్ ఎన్ఏ పెట్రోల్ (ఏడబ్యూడీ): 19.07 కి.మీ./లీ మైలేజీని అందిస్తుంది.

మారుతీ కొత్త ఎస్యూవీ 'విక్టోరిస్' లాంచ్ - Tholi Paluku