Let's talk: editor@tmv.in
మానవత్వం చాటుకున్న మంత్రి

మానవత్వం చాటుకున్న మంత్రి

FL - SUNL
24 సెప్టెంబర్, 2025

కాన్సర్ బారిన పడిన గురుకుల పాఠశాల విద్యార్థిని, ఆమె తల్లికి ప్రత్యేక చొరవతో వైద్యం అందించి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మానవత్వం చాటుకున్నారు. కాకినాడ ఎస్. ఎం నగర్ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్దిని మిడియం మంజుల 10 జూలై 2025 కాన్సర్ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ(APSWREIS) సెక్రటరీ వి. ప్రసన్న వెంకటేష్ చొరవ తీసుకుని విద్యార్దినిని విశాఖలోని హోమీబాబా కాన్సర్ ఆస్పత్రిలో చేర్చించి ప్రత్యేక వైద్యం అందించారు.

విద్యార్దిని తల్లికి కూడా కాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించటంతో ఆమెకు కూడా మంత్రి ప్రత్యేక చొరవతో వైద్యం అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న విద్యార్దిని, ఆమె తల్లి వాణి ఆస్పత్రి నుంచి డిశ్చార్డ్ అయ్యారు. ఈ సంధర్బంగా మంగళవారం నాడు వెలగపూడి శాసనసభ లాబీల్లో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలిసి విద్యార్దిని, ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్దిని కాన్సర్ లక్షణాల్ని ప్రాధమిక దశలోనే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించిన పాఠశాల సిబ్బందిని, విద్యార్ది ఆరోగ్య పరిస్ధితిని నిరంతరం పర్యవేక్షణ చేసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల అధికారుల్ని, డా. రాజేష్ ని ఈ సందర్భగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందించారు.

మానవత్వం చాటుకున్న మంత్రి - Tholi Paluku