Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Gaddamidi Naveen
23 నవంబర్, 2025

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ సీఎం మోహన్ యాదవ్‌‌కి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముఖ్య ప్రాజెక్టుల వివరాలను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.వీటిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ,ఈ నూతన యూనివర్సిటీల స్థాపన లక్ష్యాలు వాటి ద్వారా యువతకు, రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను గురించి ఎంపీ సీఎం మోహన్ యాదవ్‌‌కి వివరించారు.ఇంకా, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, నగరాభివృద్ధి, సాంకేతిక విభాగాలపై కూడా మోహన్ యాదవ్ కి వివరించారు.ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం పాలనా పద్ధతులపై కూడా చర్చించుకున్నట్లు సమాచారం. ఈ భేటీ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగింది.

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ - Tholi Paluku