
మధ్యప్రదేశ్ లో 10 మంది నక్సల్స్ లొంగుబాటు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో ఆదివారం సాయంత్రం బాలాఘాట్‌లో రూ. 2.36 కోట్ల రివార్డు ఉన్న 10 మంది నక్సలైట్లు లొంగిపోయారని అధికారులు తెలిపారు. దిండోరి, మండ్లా జిల్లాలు ఇప్పుడు పూర్తిగా నక్సల్ ప్రభావం నుంచి విముక్తయ్యాయని తెలిపారు. జనవరి నుంచి బాలాఘాట్‌లో పూర్తిస్థాయి నక్సల్ నిర్మూలన ఉద్యమం ప్రారంభమవుతాయి. జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చే వారికి 15 సంవత్సరాల పునరావాస ప్యాకేజీ ఇస్తాం. లొంగిపోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.లొంగిపోయిన ఈ పది మంది నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన ‘భోర్సాదేవ్ ఏరియా కమిటీ’ సభ్యులు.
వీరు ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్ సహా ఆయుధాలను అధికారులకు అప్పగించారు. వీరు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జోన్‌లోని కాన్హా టైగర్ రిజర్వ్ (మండ్లా, ఎంపీ) ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లా భోరందేవ్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ ప్రాంతాలు ఉన్న కొత్త కెబీ డివిజన్‌కు చెందినవారు. ఈ డివిజన్‌కు అల్ట్రా సుందర్ ఆలియాస్ కబీర్ నేతృత్వం వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌కు మహారాష్ట్రలోని గోందియా జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్, ఖైరాగఢ్, కవర్ధా జిల్లాలతో సరిహద్దులు ఉన్నాయి అని అధికారి ఒకరు తెలిపారు.
వీరు గోందియా, రాజ్‌నంద్‌గావ్, బాలాఘాట్ (జీఆర్బీ డివిజన్) ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యాదవ్ లొంగిపోయిన నక్సలైట్లకు రాజ్యాంగ ప్రతులను అందజేశారు అని అధికారులు పేర్కొన్నారు.
లొంగిపోయిన నక్సలైట్లలో
సుందర్ ఆలియాస్ కబీర్ ఆలియాస్ సోమా (ఏకే-47, రివార్డు రూ.62 లక్షలు)
రాకేష్ ఓడో ఆలియాస్ బీమా (ఏకే-47, రూ.62 లక్షలు)
సమర్ ఆలియాస్ సమ్రు ఆలియాస్ రాజు (.303 రైఫిల్, రూ.14 లక్షలు)
సతాలీ ఆలియాస్ బాలిసా అల్తాడ్ (రూ.14 లక్షలు)
విక్రమ్ ఆలియాస్ హిడ్మా (రూ.14 లక్షలు)
లాల్‌సింగ్ మడావి ఆలియాస్ సీంగూ (ఇన్సాస్, రూ.14 లక్షలు)
శివరాం మువే ఆలియాస్ జోగా (ఇన్సాస్, రూ.14 లక్షలు)
జయంత్ ఆలియాస్ జోగి గుడప్ (రూ.14 లక్షలు)
జయశ్రీ ఆలియాస్ లాల్తం (సింగిల్ షాట్ గన్, రూ.14 లక్షలు)
నవీనా మువే ఆలియాస్ హిడ్మా (సింగిల్ షాట్ గన్, రూ.14 లక్షలు) ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ కైలాష్ మక్వానా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను తెలిపారు.
