
మధిర నుంచి తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం సెప్టెంబర్ 23 నుండి 30 వరకు ప్రత్యేక రైళ్లు, అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ప్యాకేజీ వివరాలు: దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగంతో
తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు. వ్యవధి: సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు (7 రాత్రులు/8 రోజులు). టికెట్ ధరలు సాధారణం - రూ.14,100, 3 ఏసీ - రూ.22,500, 2 ఏసీ - రూ.29,500. సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళతాయి.
సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్ వసతి, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కార్ట్ సేవలు, రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ఉచిత రవాణా, ప్రయాణ బీమా.
భద్రత: ప్రతి కోచ్కు సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు. ప్రతి 39 మంది ప్రయాణికులకు ఒక కోఆర్డినేటర్, 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు.
దేశీయ ఎయిర్ ప్యాకేజీలు (ధరలు):
గుజరాత్ (8 రోజులు): రూ.38,000
కశ్మీర్ (6 రోజులు): రూ.33,750
మేఘాలయ, అస్సాం (7 రోజులు): రూ.43,250
కర్ణాటక (6 రోజులు): రూ.37,050
అండమాన్ నికోబార్ (6 రోజులు): రూ.54,925
రాజస్థాన్ (6 రోజులు): రూ.32,450
ఒడిశా (6 రోజులు): రూ.35,000
తమిళనాడు (6 రోజులు): రూ.34,600
అంతర్జాతీయ ఎయిర్ ప్యాకేజీలు:
థాయిలాండ్ (5 రోజులు): రూ.65,600
శ్రీలంక (6 రోజులు): రూ.63,300
ఎయిర్ ప్యాకేజీ సౌకర్యాలు: విమాన టికెట్లు (రెండు వైపులా), ఉదయం-రాత్రి భోజనం, ఏసీ రవాణా, 3/5 స్టార్ హోటల్ వసతి, ఐర్సీటీసీ టూర్ మేనేజర్, ప్రయాణ బీమా.
బుకింగ్ వివరాలు:
టికెట్ బుకింగ్ కోసం 9701360701, 9281030726, 9281030750 నంబర్లను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ను సందర్శించాలని పీవీ వెంకటేష్ సూచించారు.
