
‘మోదీ’ బయోపిక్ పోస్టర్ రిలీజ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాల జోరు హోరు మాములుగా లేదు. ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ హిట్, బాక్స్ ఆఫీస్ కు కొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు సినిమా కథల విషయంలో కూడా వైవిధ్యం కనపడుతుంది.
ఇప్పుడు నెట్టింట్లో మరో కొత్త పోస్ట్ హల్చల్ చేస్తుంది. సీహెచ్ దర్శకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘మా వందే’ బయోపిక్ లో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు. కీలకమైన మోడీ పాత్రలోకి రంగ ప్రవేశం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు సందర్బంగా ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు మరోసారి హీరో ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సెప్టెంబర్ 22న మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వీర్ రెడ్డి.ఎం నిర్మాత బాధ్యతలు తీసుకోగా సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.
ఈ పోస్టర్ లో మోడీ ముందుకు నడుస్తుంటే తల్లి తనను దీవిస్తున్నట్టు చేయి ఆయనకు అండగా ఉన్నట్టు చూపిస్తుంది. మోడీ బయోపిక్ విషయానికొస్తే చిన్ననాటి నుంచి మోడీ జీవితంలో లోని ఘటనలు, ఈ స్థాయికి రావడానికి ఆయన ప్రయాణం ఎలా కొనసాగింది. పీఎం మోడీ గా ఆయన ప్రస్తుతం ఇలా వ్యక్తిగత, రాజకీయ జీవనంలోని ప్రధాన ఘట్టాలను ‘మా వందే‘ ద్వారా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ ఎదుగుదలకు, ఆయన ప్రతి అడుగులో తల్లి హీరాబెన్ ప్రోత్సాహం, సంకల్ప బలం తెరపై వివరించేలా, మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
