
మద్యం తాగి బైక్ నడిపిన యువకుడికి కోర్టు వినూత్న శిక్ష
మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఒక యువకుడికి పుణే మోటార్ వెహికల్ కోర్టు వింత శిక్ష విధించింది. సాధారణంగా జరిమానాతో ముగిసే ఇలాంటి కేసులో ఈసారి కోర్టు నేరస్తుడికి కోర్టు మరో సామాజిక బాధ్యతను కట్టబెట్టింది. అయితే కోర్టు తీర్పు ప్రకారం ఆ యువకుడికి పదివేల జరిమానాతో పాటుగా ప్రజల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించేలా పదివేల అవగాహన పాత్రలను ముద్రించి ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశించింది.
పింప్రీ–చించ్వడ్ ట్రాఫిక్ పోలీసుల సమాచారం ప్రకారం, జులై 22న హింజవాడీ ప్రాంతంలో నిందిత యువకుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో పోలీసులు అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ నేరంకింద కేసు నమోదు చేసి విచారణ అనంతరం అతడిని కోర్టులో హాజరు పరిచారు. కాగా తాజా విచారణ హైకోర్టు భారతీయ నగరిక సురక్షా సంహిత సెక్షన్ 23 ప్రకారం రూ. 10,000 జరిమానా విధించడం తో పాటుగా మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో అతడు 1,000 అవగాహనా హ్యాండ్‌బిల్లులు ముద్రించి నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.
ఈ ప్రత్యేక శిక్షపై పోలీసులు అధికారులు స్పందిస్తూ ఈ వింత పనిషమెంట్ తాగి డ్రైవింగ్ చేసే నేరస్థులకు ఒక గుణపాఠంగా నిస్తుందని అంతేకాక రోడ్డు భద్రతపై నేరస్తుల్లో బాధ్యతను పెంపొందించడానికి, ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రాఫిక్ శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాక మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు పింఛ్ చించ్వడ్ పోలీసు పరిధిలో మొత్తం 2,984 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రతి కేసును కోర్టుకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
