Let's talk: editor@tmv.in
మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: అచ్చెన్నాయుడు

మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: అచ్చెన్నాయుడు

Panthagani Anusha
3 మార్చి, 2026

మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. గత ఐదేళ్ల పాలనలో మత్స్యకారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని తెలిపారు.

కాగా కోటబొమ్మాలి నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సంతబొమ్మాలి మండలం గొలుగువానిపేట గ్రామానికి చెందిన గొర్లె రామారావు కుటుంబానికి ప్రభుత్వం తరఫున మంజూరైన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మంత్రి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

95 కుటుంబాలకు ఆర్థిక సాయం

కాగా రాష్ట్ర వ్యాప్తంగా వేట సమయంలో వివిధ ప్రమాదాల్లో మరణించిన 95 మంది మత్స్యకారులు కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రాణాలకు తెగించి సముద్రంలో శ్రమిస్తున్న మత్స్యకారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అదేవిదంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: అచ్చెన్నాయుడు - Tholi Paluku