Let's talk: editor@tmv.in
మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల:మంత్రి అచ్చెన్నాయుడు

మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల:మంత్రి అచ్చెన్నాయుడు

Panthagani Anusha
22 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్ల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం తెలిపారు. 2018 సంవత్సరం నుండి వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మొత్తం 95 మంది లబ్ధిదారులలో ఇప్పటికే 90 మంది కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియా మొత్తాలు జమ చేయబడినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన 5 మంది ఖాతా వివరాల్లో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా జమ ప్రక్రియలో కొంత జాప్యం జరిగిందని వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి త్వరలోనే నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, బాధిత కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా సాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.