
మంత్రి సీతక్క ఇలాకాలో అభివృద్ధి గల్లంతు
రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో అభివృద్ది కనిపించడం లేదు. ములుగు జిల్లా ఏటురునాగారం మండలం లోని మల్యాల, కొండాయి, గోవిందరాజుల గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజవర్గంలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. కొన్ని గ్రామాలకు రోడ్డు మార్గాలు పూర్తిగా లేవు కనుక, వైద్యం అవసరమైనప్పుడు స్థానిక డాక్టర్లు పలు గ్రామాలకు చేరుకోవడానికి నదులు లేదా వాగుల ద్వారా బోటుతో ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది.
మల్యాల, కొండాయి, గోవిందరాజుల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి గత వర్షాకాలంలో కూలిపోయింది, దీంతో వాహన ప్రయాణం నిలిపివేయడం ద్వారా, ప్రజలకి భారీ అంతరాయాలు ఏర్పడాయి. డాక్టర్ ఒక గ్రామానికి బోటులో వాగు దాటి, అక్కడి నుండి 2 కిలోమీటర్ల మేర కాలినడక ప్రయాణం చేసి చికిత్స అందించాల్సి వస్తుందని, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రి సీతక్క ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో మాత్రమే “చుట్టం చూపుగా” వచ్చి హామీలు ఇవ్వడం కాదు . అమలు చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజవర్గంలో సరైన రహదారులను, బ్రిడ్జిలు నిర్మించాలని తెలిపారు. మంత్రి సీతక్క సంవత్సరం నుండి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
