Let's talk: editor@tmv.in
మజ్లిస్ పార్టీ తెలుగు రాష్ట్రాలకు ముప్పు – కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి

మజ్లిస్ పార్టీ తెలుగు రాష్ట్రాలకు ముప్పు – కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి

Saikiran Y
31 అక్టోబర్, 2025

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందిచి, ఘట్‌కేసర్‌లో గోరక్షక సేవకుడు ప్రశాంత్ కుమార్ (సోనూసింగ్)పై మజ్లిస్ నాయకుడు ఇబ్రహీం ఖురేషీ తుపాకీతో జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హాస్పిటల్‌లో బాధితునికి సకాలంలో వైద్యం అందించేందుకు ఆ పార్టీ నేతలు చొరవ తీసుకున్నారని వివరించారు.

రాచకొండ కమిషనర్‌ ముగ్గురిని అరెస్ట్ చేసి, మరొకరు పరారీలో ఉన్నారని వెల్లడి చేశారు. ప్రశాంత్‌ అనేక సంవత్సరాలుగా గోరక్షణ కోసం సేవ చేస్తూ, పోలీసుల బాధ్యతను గోరక్షకులు నిర్వర్తించాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు. గత కొంతకాలంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గో రక్షణ, అక్రమ రవాణా ఘటనలు పెరుగుతున్నాయన్న ఆయన, జవాబుదారితనంతో నడుచుకోవాల్సిన పోలీసు వ్యవస్థ మఫియా పన్నాగాల్లో కీలుబొమ్మలుగా మారిందని ఆరోపించారు.

మఫియాకు మజ్లిస్ నాయకులు అండగా ఉంటున్నారనీ, అదే విషయాన్ని తాజాగా జరిగిన ఘట్‌కేసర్ ఘటనతో తెలుస్తుందని ద్వజమెత్తారు. ఇబ్రహీం ఖురేషీపై మునుపు నుంచే అనేక ఆరోపణలు ఉండగా, అతనిని ఎంఐఎం నేత్రత్వంలోని నాయకులు విమానాశ్రయంలో ఊరేగింపుగా తీసుకెళ్లటం విచారకరమన్నారు.

ప్రజల్లో మెజారిటీ గోవులను పూజిస్తారని, గోహత్యపై నిషేధం ఉంది. కానీ నియంత్రణ చట్టాలు గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని సీఎం, సీఎస్‌కు చట్టపరమైన చర్యల గురించి లేఖలు రాశానని తెలిపారు. గోవులను సురక్షితంగా రుణించేందుకు ప్రతి పౌరుడికి హక్కు ఉన్నా, అక్రమ స్లాటర్ హౌసుల్లో విదేశీ కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు గోవుల అక్రమ రవాణాలో భాగస్వాములని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి సమస్యగా మారిందని, రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతుందని విమర్శించారు. మజ్లిస్ పార్టి చెప్పింది అదే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అమలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాజీ మజ్లిస్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపారని, నిర్ణయం గాంధీభవన్‌లో కాకుండా మజ్లిస్ ఆదేశాలతో తీసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, మైనారిటీ ఓట్ల కోసం మంత్రి పదవి ఇవ్వడం చట్టవ్యతిరేకమని, కాంగ్రెస్ ఇవే తాయిలాలు ఉపయోగిస్తోందని కుహనా లౌకికవాదంపై మండిపడ్డారు.

మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానికొకటి బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ, రాష్ట్ర మౌలిక చట్టాలను సవరణకు గురిచేస్తున్నాయని, అట్టి పార్టీలు ఓవైసీ కనబడితే వంగి వచ్చి అభివాదాలు చేస్తుంటాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు మజ్లిస్ అభ్యర్థులను బహిరంగంగా అద్దెకు తీసుకుని, ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మజ్లిస్ పార్టీ తెలుగు రాష్ట్రాలకు ముప్పు – కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి - Tholi Paluku