Let's talk: editor@tmv.in
మంచిర్యాలలో ఆగనున్న "వందే భారత్”

మంచిర్యాలలో ఆగనున్న "వందే భారత్”

Gaddamidi Naveen
16 సెప్టెంబర్, 2025

మంచిర్యాల నుండి హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సందర్బంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో అభివృద్ది కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, స్థానిక ఎంపీ వంశీ కృష్ణ, ఎమ్మేల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. వందే భారత్ రైలును జెండా ఊపి కేంద్ర మంత్రి బండి తో పాటు అందరూ కలిసి ప్రారంభించారు. ఈ కార్య్రమానికి బీజేపీ, కాంగ్రెస్ , కార్యకర్తలు భారీ ఎత్తున తరలవచ్చారు. జై బీజేపీ జై బండి సంజయ్ నినాదాలతో మంచిర్యాల రైల్వే స్టేషన్ మారుమోగింది.

బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపాలి ,ఇక్కడ అభివృద్ది పనుల కోసం వచ్చాం. ఎలాంటి గొడవలు,నినాదాలు చేయవద్దు అని ఇరువర్గాలకు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎక్కువగా పెంచారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం మంచిర్యాలలో ప్రసంగించారు. అలాగే తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఎమ్మేల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ సహకారంతో మంచిర్యాలకు వందే భారత్ రైలు వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం మంచిర్యాలలో పుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలకు అలాడుతున్నారని, ఈ విషయాని దృష్టిలో ఉంచుకోన్ని పుట్ ఓవర్ బ్రిడ్జికు నిధులు మంజూర్ చేయాలని రాష్ట్ర, కేంద్ర,మంత్రులను కోరారు. శబరిమలకు వేళ్ళే భక్తుల ఇబ్బందులను తోలగించాలని కోరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వే చరిత్రలోనే వందే భారత్ రైలు చరిత్ర స్రుష్టిస్తోందన్నారు.2019 ఫిబ్రవరిలో "వందే భారత్ “ రైలు ప్రారంభమవ్వగా నేడు దేశవ్యాప్తంటా 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నయని గుర్తు చేశారు. అతి తర్వాలో 3.5కోట్ల వ్యయంతో మంచిర్యాలకు పుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూర్ చేస్తానని ప్రజలకు బండి సంజయ్ శుభవార్త అందించారు.మంచిర్యాల రైల్వే స్టేషన్ కు అమృత్ భారత్ కింద రూ.26కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

మంచిర్యాలలో ఆగనున్న "వందే భారత్” - Tholi Paluku