Let's talk: editor@tmv.in
మేఘాలయలో 8 మంది మంత్రుల రాజీనామా

మేఘాలయలో 8 మంది మంత్రుల రాజీనామా

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

ఒకేరోజు ఎనిమిది మంది మంత్రులు రాజీనామా చేసి కలకలం సృష్టించారు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఈ రాజకీయ గందరగోళం ఏర్పడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే? ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పక్కన ఉండి రాజీనామా లేఖలను రాజభవన్లో గవర్నర్ కు సమర్పించారు. మంగళవారం 12 మంది మంత్రులలో ఎనిమిది మంది రాజీనామా చేశారు. అయితే మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్(ఎండీఏ) రాష్ట్రంలోని ఎన్పీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముందు అనుకున్న విధంగా కొత్తవారికి అవకాశం కల్పించేందుకు ఈ రాజీనామాలు జరిగాయి. వీరిలో ఎక్కువమంది సీనియర్ నాయకులే ఉండడం గమనార్హం. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనేక కారణాలు ఉన్నాయి.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ సమతుల్యత, ప్రభుత్వ భాగస్వామ పక్షాలను సంతృప్తిపరచడానికే ఈ రాజీనామాల వెనుక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫోటో రైటప్; సీఎం కాన్రాడ్ సంగ్మా

మేఘాలయలో 8 మంది మంత్రుల రాజీనామా - Tholi Paluku