
మంత్రి అజహరుద్దీన్‌కు మైనారిటీ శాఖ కేటాయింపు
Gaddamidi Naveen
5 నవంబర్, 2025
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజారుద్దీన్‌కి రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక శాఖలను కేటాయించింది.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖలు మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ను కేటాయించింది. ఆయన చేరికతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.గత నెల 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇది రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.
