
భారత హాకీ అంపైర్ రఘు ప్రసాద్‌కు ‘వరల్డ్ బెస్ట్’ అంపైర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు
అంతర్జాతీయ హాకీలో భారత్‌కి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అంపైరింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ భారత అంపైర్ రఘు ప్రసాద్ కు ప్రపంచ హాకీ అత్యున్నత బహుమతుల్లో ఒకటైన ఇంటర్ నేషనల్ హాకీ ఫెడరేషన్ మేల్ అంపైర్ ఆఫ్ ది ఇయర్–2025 పురస్కారం వరించింది. అంపైరింగ్‌లో ఆయన కనబరుస్తున్న ప్రొఫెషనలిజం, నిబద్ధత, అద్భుత నిర్ణయ సామర్థ్యాలను గుర్తిస్తూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ ప్రతిష్టాత్మక అవార్డును మంగళవారం ప్రకటించింది.
రఘు ఇప్పటివరకు 198 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్ గా వ్యవహరించాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో అంపైర్ గా ఉంటే వచ్చే ఏడాది మలేషియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో 200 అంతర్జాతీయ కాప్స్ మార్క్ అందుకునే తొలి ఆసియా అంపైర్‌గా చరిత్ర సృష్టించబోతున్నాడు.
ఇంటర్ నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ ప్రో లీగ్, కామన్వెల్త్ గేమ్స్, జూనియర్ వరల్డ్ కప్స్‌తో పాటు నాలుగు హాకీ వరల్డ్ కప్స్, మూడు ఒలింపిక్స్‌లోనూ ఆయన అంపైరింగ్ చేశారు. ఆసియా గేమ్స్, ఆసియా కప్స్, ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీల్లో కూడా అనేక కీలక మ్యాచ్‌ల్లో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయి.
2003లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రఘు ప్రసాద్ ప్రతీసారి స్థిరత్వం, స్పష్టత, నాయకత్వ లక్షణాలు చూపించారు. ప్రపంచంలోని ప్రతి ఖండంలోనూ అంపైరింగ్ చేసిన అరుదైన భారత అంపైర్ ఆయనే అని ఇంటర్ నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రకటనలో పేర్కొంది. ఫిట్‌నెస్, నాలెడ్జీతో పాటు వినయశీలత ఇవే రఘు ప్రత్యేకతలు. రాబోయే కొత్త తరం అంపైర్లకు ఆయన నిజమైన ఆదర్శం అని సంస్థ అభినందించింది. అదే విభాగంలో ఇంటర్ నేషనల్ హాకీ ఫెడరేషన్ ఫిమేల్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ బహుమతి అర్జెంటినాకు చెందిన ఐరీన్ ప్రెసెన్‌కి దక్కింది. ఈ అవార్డుల ఎంపిక పూర్తిగా ఇంటర్ నేషనల్ హాకీ ఫెడరేషన్ అంపైరింగ్ కమిటీ సూచనల ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుంది.
ఈ ‘అంపైర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు 2015 నుంచి ఇంటర్ నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రధానం చేస్తోంది.
మహిళలు, పురుషులకు ఈ అవార్డులను ఇస్తున్నారు. 2019–21 వరకు ప్రపంచంలో కోవిడ్ ఉదృతి వల్ల ఆయా సంవత్సరాల్లో అవార్డులను ప్రకటించలేదు.
సంవత్సరం* *పురుషుల విభాగంలో* *మహిళల విభాగంలో
2023–24
స్టీవ్ రజర్స్ (ఆస్ట్రేలియా)
సారా విల్సన్ (స్కాట్లాండ్)
2022–23
బెన్ గోన్‌ట్‌జెన్ (జర్మనీ)
అయానా మెక్‌లీన్ (ట్రినిడాడ్–టొబాగో)
2021–22
కోయెన్ వాన్ బుంజే (డచ్)
అంబర్ చర్చి (న్యూజిలాండ్)
2018
మార్సిన్ గ్రొఖాల్ (పోలాండ్)
మిచెల్ మైస్టర్ (జర్మనీ)
2017
జాన్ రైట్ (దక్షిణ ఆఫ్రికా)
సారా విల్సన్ (స్కాట్లాండ్)
2016
క్రిస్టియన్ బ్లాష్ (జర్మనీ)
లారిన్ డెల్‌ఫోర్జ్ (బెల్జియం)
2015
నాథన్ స్టాగ్నో (జిబ్రాల్టర్)
మిచెల్ జౌబెర్ట్ (దక్షిణ ఆఫ్రికా)
