
భారత లగ్జరీ ఫ్యాషన్‌లో కొత్త ఒరవడి.. బూన్ ఫ్యాషన్స్
భారతదేశంలో ఫ్యాషన్ రంగం కొత్త జోష్‌తో ముందుకు సాగుతోంది. ‘బూన్ ఫ్యాషన్స్’ అనే కొత్త బ్రాండ్ ప్రీమియం ఫ్యాషన్‌లో వ్యక్తిగత శైలిని అందించే లక్ష్యంతో అడుగుపెట్టింది. ఖుష్బూ సింగ్, సురభి భావ్‌సర్ స్థాపించిన ఈ బ్రాండ్ వేగంగా మారే ఫాస్ట్ ఫ్యాషన్‌కు బదులు, శాశ్వతంగా నిలిచే, వ్యక్తిత్వాన్ని చాటే దుస్తులను అందిస్తోంది.
ఈ బ్రాండ్‌ను స్థాపించిన ఇద్దరు మహిళలు ఫ్యాషన్ రంగంలో అనుభవజ్ఞులు. వారు బూన్‌ను కేవలం బ్రాండ్‌గా కాక, ఒక శైలీ ఉద్యమంగా చూస్తున్నారు. “భారత ఫ్యాషన్ మార్కెట్‌లో ఒకే తరహా డిజైన్లు, ఫాస్ట్ ఫ్యాషన్ రొటీన్ అయిన ప్రస్తుత కాలం లో , వ్యక్తిగత రుచిని ప్రతిబింబించే దుస్తుల కోసం బూన్ వచ్చింది,” అని ఖుష్బూ సింగ్ చెప్పారు.
బూన్ ఫ్యాషన్స్‌లో పురుషులు, మహిళల కోసం సరళమైన డిజైన్లు, ఆకర్షణీయ వివరాలతో కూడిన దుస్తులు ఉన్నాయి. ఆఫీస్ సమావేశాల నుంచి సాయంత్రం పార్టీల వరకు, ఈ దుస్తులు నాణ్యత, సౌకర్యం, శైలిని సమతుల్యం చేస్తాయి. ఈ బ్రాండ్ పట్టణ జీవనశైలి గల వృత్తిపరులు, సృజనాత్మక వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ‘ప్రతి వస్త్రం ఒక కథ చెబుతుంది. అది ధరించిన వ్యక్తి శైలిని ప్రతిబింబిస్తుంది,’ అని సురభి భావ్‌సర్ తెలిపారు. బూన్ ఫ్యాషన్స్ లగ్జరీని అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అధిక ధరల గురించి కాదు, నాణ్యత, నైపుణ్యం, భావోద్వేగ కలయిక గురించని వారు చెబుతున్నారు.
భారతీయ సంస్కృతిని గ్లోబల్ డిజైన్లతో మేళవించి, విభిన్న శరీర ఆకృతులకు సరిపడేలా, సుస్థిరతకు కట్టుబడి ఈ బ్రాండ్ దుస్తులను రూపొందిస్తోంది. భారత లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్ల విలువైనది. రాబోయే ఐదేళ్లలో ఇది రెట్టింపు వృద్ధి సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిల్లేనియల్స్, జనరేషన్-జడ్ వినియోగదారులు వ్యక్తిగతీకరణ, నైతిక ఉత్పత్తులపై ఆసక్తి చూపడం ఈ వృద్ధికి కారణం. బూన్ ఫ్యాషన్స్ ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా రూపొందింది. వ్యక్తిగత శైలి, నాణ్యత కోరుకునే వారికి ఈ బ్రాండ్ ఒక సరికొత్త ఎంపికగా నిలవనుంది.
