Let's talk: editor@tmv.in
భారత్ - భూటాన్ తొలి రైలు ప్రాజెక్టుకు ఆమోదం

భారత్ - భూటాన్ తొలి రైలు ప్రాజెక్టుకు ఆమోదం

Aravind Maryada Reddy
30 సెప్టెంబర్, 2025

భారత్, భూటాన్‌ మధ్య మొట్టమొదటి రైల్ లింక్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ఇది ఒక కీలకమైన ముందడుగుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇరు దేశాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది. అధికారిక వివరాల ప్రకారం, రెండు ప్రధాన రైల్వే మార్గాలకు ఆమోదం లభించింది. కోక్రాఝర్-గెలెఫు కొత్త లైన్, బనార్హాట్-సామ్త్సె కొత్త లైన్ ఈ రెండు లైన్లు త్వరలో నిర్మించబోతున్నారు.

కోక్రాఝర్-గెలెఫు లైన్

ఈ ప్రాజెక్టు కోసం ₹3,456 కోట్ల పెట్టుబడిని కేటాయించారు. ఈ మార్గం అస్సాంలోని కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాలను భూటాన్‌లోని సర్పంగ్ ప్రాంతంలోని గెలెఫుతో కలుపుతుంది. ఇది ప్రజలు, వస్తువుల రవాణాను సులభతరం చేయడమే కాక, మెరుగైన ఆర్థిక, ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని అధికారులు తెలిపారు. భూటాన్ ప్రణాళికల ప్రకారం, గెలెఫును ఒక మైండ్‌ఫుల్‌నెస్ సిటీగా అభివృద్ధి చేస్తున్నారు.

బనార్హాట్-సామ్త్సె లైన్

ఈ ప్రాజెక్టుకు వ్యయం ₹577 కోట్లుగా నిర్ణయించారు. ఈ మార్గం పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాను భూటాన్‌లోని సామ్త్సెతో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల సరిహద్దు వాణిజ్యం, అనుసంధానం పెరుగుతుందనే అంచనా ఉంది. భూటాన్ ప్రభుత్వం సామ్త్సె ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రం (ఇండస్ట్రియల్ హబ్)గా అభివృద్ధి చేస్తోంది. దాదాపు 700 కిలోమీటర్ల పొడవున ఉన్న భారతదేశం-భూటాన్ సరిహద్దును కలుపుతూ చేపట్టిన ఈ ప్రాజెక్టులు, భారతీయ నౌకాశ్రయాల (ఇండియన్ పోర్ట్స్) ద్వారా భూటాన్‌కు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను అందుబాటులోకి తెస్తాయి. భూటాన్ ఆర్థిక కేంద్రాలకు మద్దతు ఇవ్వడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం తీసుకున్న నిబద్ధతలో భాగంగానే ఈ కొత్త లైన్లను చూస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో సహాయపడతాయని అధికారులు నొక్కి చెప్పారు. ఇరు దేశాల భాగస్వామ్యానికి అనుసంధానం అనేది ఒక మూలస్తంభంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. రైల్వే అనుసంధానం కోసం భారత్, భూటాన్ మధ్య చేపట్టిన కీలకమైన ముందడుగా అభివర్ణించారు. "భారతదేశం, భూటాన్ మధ్య రైల్వే అనుసంధానం ఏర్పాటుకు ఒక ప్రధాన కొత్త చొరవ ఉంది. అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ఢిల్లీలో నిర్వహించిన ఒక సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బలమైన సంబంధాలకు నిదర్శనం

భారతదేశం-భూటాన్ బంధంపై విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. భారతదేశం, భూటాన్ అసాధారణమైన విశ్వాసం ఏర్పడనున్నది. పరస్పర గౌరవం, అవగాహనతో కూడిన సంబంధాన్నిపంచుకుంటున్నాయి. ఇది సాంస్కృతిక, నాగరికత బంధాలు, విస్తృతమైన ప్రజల సంబంధాలు, అలాగే మన భాగస్వామ్య అభివృద్ధి, భద్రతా ప్రయోజనాలలో పాతుకుపోయిన బంధమని వివరించారు. గత సంవత్సరం మార్చి 2024లో ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్‌లో పర్యటించినప్పుడు, ఆయనకు భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రదానం చేశారు. భూటాన్ రాజు, ఆ దేశ ప్రధాన మంత్రి తరచుగా భారతదేశాన్ని సందర్శిస్తున్నారని మిస్రీ గుర్తు చేశారు.

భూటాన్ అభివృద్ధిలో భారతదేశం పాత్రను గురించి మిస్రీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "భూటాన్‌కు అత్యధికంగా అభివృద్ధి సహాయం అందించే దేశం భారత ప్రభుత్వమే. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, దేశం మొత్తం ఆర్థికాభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది," అని ఆయన ఉద్ఘాటించారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక (2024 నుంచి 2029) కోసం, భారత ప్రభుత్వం ₹10,000 కోట్ల కేటాయించడానికి అందించడానికి కట్టుబడి ఉంది. ఈ మొత్తం 12వ పంచవర్ష ప్రణాళిక గణాంకాలతో పోలిస్తే 100 శాతం పెరుగుదల అని మిస్రీ వెల్లడించారు.

భారత్ - భూటాన్ తొలి రైలు ప్రాజెక్టుకు ఆమోదం - Tholi Paluku