Let's talk: editor@tmv.in
భారతగడ్డపై ఆడటం దక్షిణాఫ్రికాకు సవాలే: సౌరవ్ గంగూలీ

భారతగడ్డపై ఆడటం దక్షిణాఫ్రికాకు సవాలే: సౌరవ్ గంగూలీ

Pinjari Chand
12 నవంబర్, 2025

ఎప్పుడూ భారత్ గడ్డ పై భారత్‌తో ఆడటం సులభం కాదని, దక్షిణాఫ్రికాకు ఈ పర్యటన గట్టి సవాలు కానుందని క్రికెట్‌ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగబోయే తొలి టెస్ట్‌పై ఆయన ఆసక్తి కనబరిచారు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటిది నవంబర్‌ 15 నుంచి బెంగాల్ లోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌ నవంబర్‌ 22న గుహవాటీ బార్సాపారా స్టేడియంలో జరగనుంది.

అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ పై బెంగాల్ టైగర్, ఇండియన్ మాజీ కప్టెన్ గంగూలీ మాట్లాడారు. భారత్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమైన పని. ఉపఖండంలోనే కాదు, విదేశీ పర్యటనల్లో కూడా భారత్‌ ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది.అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. దక్షిణాఫ్రికా కూడా మంచి జట్టే. అందుకే ఈ సిరీస్‌ హై-ఓల్టేజ్ పోరాటంగా మారనుందన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఐదు రోజులు పూర్తి ఆసక్తికరమైన మ్యాచ్‌ చూడబోతున్నాం. అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. రిషభ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌లో ఆడతాడు అని తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదం తర్వాత రిషభ్‌ పంత్‌ ఈ టెస్ట్‌ మ్యాచ్‌తో తిరిగి ఆడబోతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ కారణంగానే ఈడెన్‌ గార్డెన్స్‌ టికెట్లు క్షణాల్లో అమ్ముడైనట్లు తెలుస్తోంది.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ హెల్డరైన దక్షిణాఫ్రికాకు ఇది కష్టమైన పర్యటనే అవుతుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. భారత్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఈ హోమ్‌ సిరీస్‌లో అడనుంది. ఇంగ్లాండ్‌ పర్యటనలో 2–2తో సిరీస్‌ డ్రా చేసుకున్న భారత్‌, ఆ తర్వాత వెస్టిండీస్‌పై 2–0 తేడాతో సీరిస్ ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో గిల్‌ అత్యుత్తమ ఫామ్‌ కనబరిచాడు. ఈ సీరిస్ లో 754 పరుగులు సాధించి, సగటు 75.40గా నమోదైంది. నాలుగు శతకాలు బాదాడు.

మరోవైపు, టెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా ఇటీవల పాకిస్తాన్‌ పర్యటనలో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ–20లు దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు వన్డే సిరీస్‌ లో జట్టులో చేరే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ ద్వారా వచ్చే ఏడాది జరిగే టీ–20 వరల్డ్‌ కప్‌కు ఇరుజట్లకు విలువైన సన్నద్ధత పొందనున్నాయి. మొత్తానికి ఈడెన్‌ గార్డెన్స్‌లో మొదలయ్యే భారత్‌–దక్షిణాఫ్రికా సిరీస్‌ క్రికెట్‌ అభిమానులకు రసవత్తర పోరుగామారనుంది.

భారతగడ్డపై ఆడటం దక్షిణాఫ్రికాకు సవాలే: సౌరవ్ గంగూలీ - Tholi Paluku