Let's talk: editor@tmv.in
భారతీయులు పెద్ద తాగుబోతులేం కాదట

భారతీయులు పెద్ద తాగుబోతులేం కాదట

FL - BHAVN
19 సెప్టెంబర్, 2025

ఎవరేమనుకున్నా మనోళ్లు పెద్ద తాగుబోతులు కాదని అమెరికాలోని సీఐఏ విడుదల చేసిన నివేదిక వెల్లడి చేస్తోంది. వాళ్లు విడుదలచేసిన తాగుబోతుల జాబితాలో భారతదేశం 111 వ స్థానంలో ఉందిమరి. ఏడాదికి సగటునా కేవలం 3.09 లీటర్ల స్వచ్ఛమైన ఆల్కహాల్ వినియోగిస్తున్నారట మన తాగుబోతులు. ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 9.8 లీటర్లకు మించకుండా స్వచ్ఛమైన ఆల్కహాల్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది 100 గ్లాసుల వైన్ కి సమానం. వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ లో పొందు పరిచేందకు గాను CIA ఈ సమాచారాన్ని266 దేశాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించింది.

- ఈ అధ్యయనంలో అత్యంత తాగుబోతుదేశంగా కుక్ దీవులను పరిగణించాలి. వీరు 12.97 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నారట. ఇది సూచించిన మోతాదుకు దాదాపు 28 శాతం ఎక్కువ.

- 12.9 లీటర్లతో లాత్వియా రెండో తాగుబోతు దేశంగా నిలవగా 12.73 తో చెక్ రిపబ్లిక్ మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది.

- మొదటి ఐదు స్థానాల్లో లిథువేనియా 11.93, ఆస్ట్రీయా 11.9 స్థానం సంపాదించాయి.

- బీరు ప్రేమిక జర్మనీ 19 స్థానానికి పరిమితమైంది. వీరు కేవలం 10.56 లీటర్ల ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తున్నారట.

- అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో బాగా వెనుకబడిందనే చెప్పాలి. అమెరికన్లు తాగుబోతులుగా 35 వ స్థానంలో నిలిచారు. వీరు ఏడాదికి సగటున కేవలం 8.9 లీటర్ల ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తున్నారట.

- ఆల్కహాల్ వినియోగంలో బాగా వెనుకగా ఉన్న దేశాల్లో ఆసియా దేశాలనే చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా సున్నా లీటర్ల ఆల్కహాల్ వినియోగాన్ని బంగ్లాదేశ్, కువైట్, మౌరిటానియా, సౌది అరేబియా నమోదు చేసుకున్నాయి. వీరితో పాటు సోమాలియన్లు కూడా అసలు తాగడం లేదట.

- ఆధ్యాత్మిక ప్రదేశం నేపాల్ కూడా 0.36 లీటర్లతో 167 వ స్థానంలో ఉంది. మనం పాకీస్థానీల కంటే ఎక్కువే తాగుతున్నాము వారు 0.04 లీటర్లతో 180 వ. స్థానంలో ఉన్నారు. శ్రీలంకన్లు కూడా బానే తాగుతున్నారు. 2.58 లీటర్లతో 122 స్థానాన్ని ఆక్రమించారు. చైనీయులు 4.48 లీటర్ల ఆల్కహాల్ వినియోగంతో 89 వస్థానంలో నిలిచారు.

- సాధారణంగా వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొత్తం ఆల్కహాల్ కూడా మూడు లేదా అంత కంటే ఎక్కువ రోజుల్లో తాగవచ్చు. అంతా ఒకేసారి కూడా తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం ఆరు మీడియం సైజు గ్లాసుల వైన్ లేదా ఆరు పింట్ల బీర్ కు సమానం.

ఈ లీటర్ల లెక్కలన్నీ స్వచ్ఛమైన ఆల్కహాల్ కు సంబంధించినవి. అంటే దాదాపు 300 లీటర్లన్న మాట ఇది ఏ దేశానికైనా సరే సగటు మోతాదు కంటే చాలా ఎక్కువనే చెప్పవచ్చు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యప్తంగా 2.3 బిలియన్ల జనాభా ప్రస్తుతం తాగుబోతులుగా పరిగణించబడుతున్నారు. అంటే వీరంతా రోజూ తాగుతారన్న మాట. ప్రపంచ వ్యప్తాంగా మొత్తం మరణాల్లో ఐదు శాతానికి పైగా ఆల్కహాల్ హానికరంగా వినియోగించడం వల్లనే సంభవిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతీయులు పెద్ద తాగుబోతులేం కాదట - Tholi Paluku