Let's talk: editor@tmv.in
భారీగా పెరిగిన ఈపీఎఫ్‌వో చందాదారులు

భారీగా పెరిగిన ఈపీఎఫ్‌వో చందాదారులు

Shaik Mohammad Shaffee
24 సెప్టెంబర్, 2025

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఈ ఏడాది జులైలో 21.04 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకున్నట్లు మంగళవారం విడుదలైన అధికారిక డేటా వెల్లడించింది. వారిలో సుమారు 9.79 లక్షల మంది కొత్త చందాదారులు ఉన్నట్లు పేర్కొంది. ఈ డేటా ప్రకారం జూలై 2024తో పోలిస్తే నికర పేరోల్ చేరికల్లో 5.55 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో చేపట్టిన పలు కార్యక్రమాల కారణంగా ఈ వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

ఈపీఎఫ్‌వో 18-25 సంవత్సరాల వయస్సు వారిలో 5.98 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరారు. ఇది జూలై 2025లో చేరిన మొత్తం కొత్త చందాదారులలో 61.06 శాతంగా ఉంది. చాలామంది యువత, ముఖ్యంగా మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు, వ్యవస్థీకృత శ్రామిక శక్తిలో చేరారు. జూలై 2025లో అంతకుముందు నిష్క్రమించిన సుమారు 16.43 లక్షల మంది సభ్యులు తిరిగి ఈపీఎఫ్ఓలో చేరారు. ఈ సంఖ్య జూలై 2024తో పోలిస్తే 12.12 శాతం చెప్పుకోదగిన వృద్ధిని డేటా చూపించింది. జూలై 2025లో సుమారు 2.80 లక్షల మంది కొత్త మహిళా చందాదారులు ఈపీఎఫ్ఓలో చేరారు. అంతేకాకుండా ఈ నెలలో నికర మహిళా పేరోల్ చేరిక సుమారు 4.42 లక్షలుగా ఉంది. ఇది జూలై 2024తో పోలిస్తే 0.17 శాతం వృద్ధిని సూచిస్తుంది.

రాష్ట్రాల వారీగా పేరోల్ డేటాను విశ్లేషించినప్పుడు మొదటి ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం నికర పేరోల్ చేరికలో 60.85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం 12.80 లక్షల మంది కొత్త పేరోల్ చేరారు. అన్ని రాష్ట్రాలలో మహారాష్ట్ర ఈ నెలలో 20.47 శాతం నికర పేరోల్ చేరికతో ముందుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వ్యక్తిగతంగా మొత్తం నికర పేరోల్‌లో 5 శాతానికి పైగా చేరికను నమోదు చేశాయి.

భారీగా పెరిగిన ఈపీఎఫ్‌వో చందాదారులు - Tholi Paluku