Let's talk: editor@tmv.in
భయపడకండి .. ప్రభుత్వం అండగా ఉంటుంది

భయపడకండి .. ప్రభుత్వం అండగా ఉంటుంది

FL - SIMHCLM
7 అక్టోబర్, 2025

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో విషజ్వరాలు.. పచ్చకామెర్లు ప్రబలి ఇద్దరు విద్యార్థినులు మరణించగా ఇంకో యాభైమంది వరకు ఆస్పత్రిపాలైన ఘటన మీద ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనవెనుకాగల పూర్వాపరాలు తెలుసుకునే నిమిత్తం ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఆ కాలేజీని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. గిరిజనసంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గం కూడా ఈ పార్వతీపురం జిల్లాలోనే ఉన్నది. దీంతో మంత్రి ఉంటున్న జిల్లాలోనే పిల్లల ఆరోగ్యానికి భద్రతా లేకుంటే అలా అంటూ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. బిడ్డలను చదువుకోసం హాష్టల్లో వేస్తె ప్రాణాలు తీస్తారా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. హాష్టల్లో అనారోగ్యానికి గురైన వారిలో కొందరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చేర్చగా మిగతావారిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు.

ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో. ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పార్వతీపురం వచ్చి.. అక్కడి వస్తావ పరిస్థితి మీద అధికారులతో సమీక్షించారు.

విద్యార్థులు అస్వస్థతకు గల కారణాలు, సమగ్ర నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాలికలు అస్వస్థతకు గల కారణాలు వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని.. తక్షణమే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతూ బాలికల హాష్టల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని, మెడల్ గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అసలు కామెర్ల వ్యాధి ఎందుకు వచ్చిందనేదాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తామని చెప్పారు. ఇట వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అన్నారు. అనంతరం అయన పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలికలతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలికలకు అందిస్తున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాలికలు ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి అచ్చెన్న డాక్టర్లు వివరించారు. బాలికలు ఆరోగ్యంగా ఉన్నారని కొంత మంది బాలికలకు వారి ఇంటికి పంపించేందుకు సిద్దం చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

భయపడకండి .. ప్రభుత్వం అండగా ఉంటుంది - Tholi Paluku