Let's talk: editor@tmv.in
భద్రాద్రి రామయ్య కల్యాణానికి సీఎంకు ఆహ్వానం

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సీఎంకు ఆహ్వానం

Gaddamidi Naveen
21 మార్చి, 2026

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అధికార ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19న ఘ‌నంగా ప్రారంభమైన ఈ వేడుక‌లు ఏప్రిల్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రత్యేకంగా మార్చి 27న జరిగే శ్రీ సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో దామోదర్ రావు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు.

ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా తిరుకళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో విశేషంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనడం ద్వారా ఉత్సవాలకు మరింత వైభవం చేకూరనుంది. ఈ వేడుకల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సీఎంకు ఆహ్వానం - Tholi Paluku