
బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తాం
ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ‘ఫ్యాప్టో’ పోరుబాట కార్యక్రమంలో విజయవాడ ధర్నా చౌక్‌లో మంగళవారం జరిగింది. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ నిర్వహించిన ‘పోరుబాట’ కార్యక్రమంలో బోధనేతర కార్యక్రమాలను, విద్యాశక్తి కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ధర్నా శిబిరం నుంచే ప్రకటించారు.
ఈ ధర్నా కార్యక్రమం ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. విద్యారంగంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోవడం వలన చాలా ఇబ్బందిగా ఉన్నదని, అదేవిధంగా పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సీ ప్రకటించాలని, 30% మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని,కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము 57 అమలు చేసి 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవి మాట్లాడుతూ బోధ నేతర కార్యక్రమాలను, విద్యాశక్తి కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు వేదిక పైనుండి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పక్షాన ప్రకటించారు. మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ లలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని 1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సి వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో నోటీస్ ఇచ్చిన 20 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండిరగ్‌లో ఉన్న 04 డి.ఎలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దొడ్డి దారి బదిలీలు చేయడం అసమంజసమని న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని అన్నారు. హై స్కూల్ ప్లస్ లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టి హైస్కూల్ ప్లస్ లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలకు, రెసిడెన్షియల్ స్కూల్స్ కు, సొసైటీలకు 62 సంవత్సరములకు పదవి వివరణ వయసు పెంచాలని డిమాండ్ చేశారు.
ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవితో పాటు ఫ్యాప్టో కో చైర్మన్స్ కె.నరహరి,బి.మనోజ్ కుమార్, సిహెచ్ వెంకటేశ్వర్లు, కె.ప్రకాష్ రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎన్.వెంకటేశ్వర్లు, కె.భానుమూర్తి, జి.శ్రీనివాసరావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కార్యదర్శి ఎం.ప్రవీణ్ కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.రఘునాథరెడ్డి, సిహెచ్‌మంజుల, జి.హృదయ రాజు, సిహెచ్.రమేష్, ఎం.బాబు రాజేంద్రప్రసాద్, సిహెచ్ రవి, పి.నరోత్తమ రెడ్డి, బి.కరిముల్లారావు చౌదరి, ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండల సభ్యులు బి.గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్.లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
