Let's talk: editor@tmv.in
బొట్టుగూడ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరు ఖరారు!

బొట్టుగూడ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరు ఖరారు!

Gaddamidi Naveen
16 అక్టోబర్, 2025

నల్గొండ జిల్లా బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు “కోమటి రెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల”గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెంబర్ 2 గా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై నల్గొండ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

శిథిలావస్థకు చేరిన పాత పాఠశాల భవనం స్థానంలో కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మాణం పూర్తయిందని. ఈ భవనం అత్యాధునాతన సదుపాయాలతో రూపుదిద్దుకోగా, పేద కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కోమటి రెడ్డి పేర్కొన్నారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రారంభమైన విద్యా విప్లవం, రాబోయే మూడు సంవత్సరాల్లో నల్గొండ నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మోడల్ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే నల్గొండలో రూ.10 కోట్ల వ్యయంతో కోమటి రెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాల నిర్మాణం పూర్తయింది. అదేవిధంగా తిప్పర్తి, కనగల్ జూనియర్ కళాశాలలను ఆధునిక మోడల్ కాలేజీలుగా అభివృద్ధి చేసే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

విద్యతో పాటు వైద్య రంగం అభివృద్ధి కూడా ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని కోమటి రెడ్డి తెలిపారు. ఇటీవల నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపీ యూనిట్‌ను ప్రారంభించి ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

కోమటి రెడ్డి ప్రతీక్ ఎవరు?

కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకైక కుమారుడు. ఈయన 2011వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ రెడ్డి 19 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయన చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ మూలాలు/వివరాలు

కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం స్థాపించిన ఒక సేవా సంస్థ.

ఫౌండేషన్ యొక్క ఉద్దేశ్యం

విద్యారంగం అభివృద్ధి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం. ఉదాహరణకు, నల్గొండలో ఇప్పటికే రూ. 10 కోట్ల వ్యయంతో కోమటి రెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం బొట్టుగూడ పాఠశాల భవనాన్ని రూ. 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఆరోగ్య, కంటి చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడం, నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడం. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపీ యూనిట్ ఏర్పాటుకు కూడా ఫౌండేషన్ కృషి చేసింది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు నిర్వహించడం. రైతులకు సాంకేతిక సహాయం, ఫర్టిలైజర్లు అందించడం, వారి పంటలకు న్యాయమైన ధర సాధించడంలో సహకారం, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా వ్యవహారాలను నిర్వహించడం వంటి కార్యాలు కార్యకలాపాలు జరుగుతున్నాయి.

బొట్టుగూడ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరు ఖరారు! - Tholi Paluku